- Telugu News Photo Gallery Cinema photos Nara Rohith Fiancé Siree Lella Family Started Pre Wedding Works, See Photos
Tollywood: ఆ హీరోతో ఏడడుగులు.. పసుపు దంచి పెళ్లిపనులు మొదలెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. త్వరలోనే ఆమె ఓ హీరోతో కలిసి ఏడుడుగు వేయనుంది. దీంతో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా తాజాగా పసుపు కొట్టే కార్యక్రమం గ్రాండ్ గా నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
Updated on: Oct 19, 2025 | 8:21 AM

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నారా రోహిత్, సిరీ లేళ్ల త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ మేరకు ఇరు ఫ్యామిలీస్ లో పెళ్లి పనులు మొదలయ్యాయి.

తాజాగా సిరీ లేళ్ల ఇంట్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా పసుపు దంచి పెళ్లి పనులు మొదలెట్టిందీ హీరోయిన్. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మరోవైపు ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు నారా రోహిత్. అంటే త్వరలోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి ముహూర్తంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

గతేడాది అక్టోబర్ లో నారా రోహిత్, సిరీ లేళ్ల న ఇశ్చితార్థం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణతో పాటు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులను ఆశీర్వదించారు

'ప్రతినిధి2’ సినిమాలో హీరో నారా రోహిత్ సరసన సిరి లేళ్ల హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగులోనే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే..ఇటీవలే భైరవం అనే సినిమాలో నారా రోహిత్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తన తర్వాతి సినిమా గురించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది.




