కొత్త గూడు.. కొత్త జ్ఞాపకాలు అంటూ.. ఫొటోస్ షేర్ చేసిన లాస్య
సమ్ థింగ్ స్పెషల్ తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ లాస్య. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. తాజాగా తన కొత్తింటిలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.
Updated on: Oct 19, 2025 | 1:58 PM

యాంకర్ లాస్య గురించి ఎంత చెప్పినా తక్కువే, అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ మా మ్యూజిక్ లో సమ్ థింగ్ స్పెషల్ అనే ప్రోగ్రామ్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఈ ప్రోగ్రామ్‌లో తన వాక్ చాతుర్యంతో అందరీనీ ఆకట్టుకుంది. తర్వాత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇలా పలు ప్రోగ్రామ్స్‌కు యాంకర్‌గా చేసి స్టార్ యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్4లో హౌజ్‌లోకి వెళ్లి తన ఆటతీరుతో అందరినీ మాయ చేసి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పెళ్లి తర్వాత బుల్లితెరకు బై చెప్పి, తన ఫ్యామిలీని చూసుకోవడంలో నిమగ్నం అయ్యింది.

సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి, యూట్యూబ్ ద్వారా తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటుంది.

ఇక రీసెంట్‌గా ఈ అమ్మడు తన సొంతింటి కలను నిజం చేసుకుంది. రీసెంట్‌గా ఈ బ్యూటీ మరో కొత్తింటిని నిర్మించుకొని అందులోకి అడుగు పెట్టింది. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. మా కలల ఇల్లు, గృహ ప్రవేశంతో శుభారంభం, ప్రతి గోడలో ఒక కల, ప్రతి మూలలో ఒక జ్ఞాపకం, మా కొత్త గూడు కొత్త ఆరంభం , కొత్త జ్ఞాపకాలు అంటూ ఫొటోస్ షేర్ చేసింది.



