- Telugu News Photo Gallery Cinema photos Samantha Opens Up On Facing Trolls and Judgments In Social Media
Samantha : విడాకులు.. అనారోగ్యం.. పబ్లిక్‌గానే జరిగాయి.. అయినా నాపై ట్రోల్స్ వచ్చాయి.. సమంత..
చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది హీరోయిన్ సమంత. కొన్నాళ్లపాటు మయోసైటిస్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్... ఇప్పుడు నిర్మాతగా మారి పలు చిత్రాలు నిర్మిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. విడాకులు, అనారోగ్యం, ట్రోలింగ్స్ పై స్పందించారు.
Updated on: Oct 18, 2025 | 8:57 PM

సమంత.. చాలా కాలం తర్వాత తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. సామ్ మాట్లాడుతూ.. "నా జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయం అందరికీ తెలుసు. ఏది జరిగినా అది ప్రజల సమక్షంలోనే జరిగింది. విడాకుల విషయంలో కానీ, ఆరోగ్యం విషయం కానీ అన్ని పబ్లిక్ గానే జరిగాయి. "

నేను ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఆ సమయంలో సోషల్ మీడియాలో నాపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్లు నా గురించి జడ్జిమెంట్స్ ఇచ్చారు. అథెంటిసిటీ అనేది ఓ గమ్యస్థానంగా నేను భావించడం లేదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. నా జీవితంలో ప్రతీది సెట్ కాలేదు. కానీ దాని గురించి నేను మాట్లాడుతున్నాను.

నేనేమి పర్ఫెక్ట్ కాదు. ఒప్పుకుంటాను. నేను కూడా చాలా తప్పులు చేశాను. వాటి నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను బెటర్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను అంటూ సమంత చెప్పుకొచ్చారు. అలాగే తాను ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చానని.. జీవితం అప్పట్లో ఎంతో కష్టంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు.

తిండి కోసం తన కుటుంబం ఎంతో కష్టాలు పడిందని.. ఒక్కసారిగా పేరు, డబ్బు, ఖ్యాతి వచ్చాయని.. కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలియలేదని అన్నారు. కానీ అవే తనకు ఓ లక్ష్యాన్ని గుర్తు చేశాయని.. ఆ వైపుగానే అడుగులు వేశానని అన్నారు. నిజాయితీ అనేది పెంపకం మీద ఆధారపడుతుందని అన్నారు.

నేను చాలా ఆశయాన్ని కలిగి ఉన్నాను. ఆశయం కేవలం అడవిలాగా ఉండకూడదు, అది ఏదో ఒక ఉద్దేశ్యంతో రావాలి. నేటి యువత తమ మార్గదర్శకులను చాలా జాగ్రత్తగా ఎంచుకోవడం ముఖ్యం… నా జీవిత పథాన్ని మార్చిన నా మార్గదర్శకులను నేను చాలా జాగ్రత్తగా ఎంచుకున్నాను. అందుకే ఉన్నత స్థానాల్లో ఉన్న ఎక్కువ మంది కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి అని అన్నారు.




