- Telugu News Photo Gallery Cinema photos Naomi scott may play a female lead role in mahesh babu ssmb29
SSMB 29: మహేశ్ కి జోడీగా హాలీవుడ్ భామ.. నెట్టింట ఫుల్ ట్రెండ్
మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్‌డేట్స్ లేకపోయినా... రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా నటించబోయే హీరోయిన్ ఎవరన్న విషయంలో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది.
Updated on: Nov 23, 2024 | 12:13 PM

అంతలా ఆయన మైండ్‌ని ఫిక్స్ చేసిన క్రెడిట్ జక్కన్నదేనా.. ఎస్ఎస్ఎంబీ29 గురించి మరికొన్ని విశేషాలు.. ఇయర్ ఎండింగ్ ట్రిప్పులకు ఎవరు వెళ్లినా వెళ్లకపోయినా మహేష్ మాత్రం ముందుంటారు.

ఏం చేసినా ఈ ఏడాదే.. ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు.. న్యూ ఇయర్ స్టార్టింగ్‌లోపు చేసేయాలని సూపర్‌స్టార్ మహేష్ ఫిక్సయ్యారా.? ఆ తర్వాత రెండేళ్లు ఏదీ కుదరదన్న క్లారిటీ మహేష్‌కి వచ్చేసిందా.?

ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా ఎవరు నటిస్తున్నారన్న విషయంలో రకరకాల వార్తలు వినిపించాయి. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్, హాలీవుడ్ హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ పేర్లు ఎక్కువగా వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ లిస్ట్‌లో మరో పేరు తెర మీదకు వచ్చింది. చార్లెస్ ఏంజెల్స్, అల్లాద్దీన్ లాంటి బ్లాక్ బస్టర్స్‌లో నటించిన నవోమి స్కాట్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేశారన్నది నయా అప్‌డేట్.

నవోమి ఇండియన్ మూలాలున్న హాలీవుడ్ నటి. అంతేకాదు ఆమె వెస్ట్రన్ మూవీస్‌లో ఎక్కువగా యాక్షన్ రోల్స్‌లో నటించారు. అందుకే ఆమెను మహేష్‌కు జోడీగా తీసుకునే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.




