Naga Chaitanya: రిటైర్ అయ్యాక ఆ ఊరు వెళ్లి సెటిల్ అంటున్న నాగచైతన్య !!
ఇప్పుడు ఇండస్ట్రీలో ఫుల్ ఫార్మ్ లో ఉన్న హీరోల్లో నాగచైతన్య ఒకరు. ఓ వైపు ఓటీటీ సీరీస్‌లతో నార్త్ లోనూ హల్ చల్ చేస్తున్నారు. సౌత్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చందుమొండేటితో తండేల్ మూవీ చేస్తున్నారు. త్వరలోనే కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. తన ఫేవరేట్ ప్లేస్ హైదరాబాద్ అని అంటున్న నాగచైతన్య... ముంబైతో ఉన్న అనుబంధాన్ని రీసెంట్‌గా గుర్తుచేసుకున్నారు.
Updated on: Jul 04, 2024 | 2:00 PM

చెన్నైలో పుట్టిపెరిగారు చైతన్య. అక్కడ పద్మాశేషాద్రి స్కూల్‌లో పది వరకు చదివారు. ప్లస్ ఒన్, ప్లస్ టూ చెన్నైలోని ఏఎంఎంలో చదివారు. ఆ తర్వాత డిగ్రీ చదివే సమయానికి హైదరాబాద్‌కి వచ్చేశారు. ఇక్కడ సెయింట్ మేరీస్‌లో బీకాం చదివారు. డిగ్రీ చదువుతున్నప్పుడే ఓ సారి సమ్మర్ వెకేషన్‌కి ముంబై వెళ్లారు.

నాలుగు నెలల పాటు అక్కడ యాక్టింగ్ క్రాష్ కోర్సు చేశారు. ఆ సమయంలో ముంబైలో టాక్సీల్లోనే తిరిగేవారట చైతన్య. ఇప్పటికీ హిందీ మాట్లాడటం రాదు చైతన్యకి. కాకపోతే ఎదుటివారు హిందీలో మాట్లాడితే అర్థం చేసుకోగలరట. చిన్నతనంలో తన తల్లితో కలిసి ట్రైన్‌లో ముంబైకి వెళ్లారట చైతూ. మరోసందర్భంలో ట్రైన్‌లో హైదరాబాద్‌కి వచ్చారట. ఆ రెండుసార్లు ట్రైన్ జర్నీని మర్చిపోలేనని అంటారు.

చెన్నై, హైదరాబాద్ గుర్తుకురాగానే దోశ కీమా, దోశ చికెన్ కర్రీ, దోశ మటన్ కర్రీ గుర్తుకొస్తుందని, నార్త్ కి వెళ్లినప్పుడు ఈ డిషెస్‌ని మిస్ అవుతానని అన్నారు చైతన్య. ఎన్ని మిస్ అయినా సరే, రిటైర్ అయ్యాక మాత్రం గోవాలోనే సెటిల్ అవుతానని అంటున్నారు మిస్టర్ చైతూ అక్కినేని.

ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో తిరిగినా గోవా తనకు చాలా స్పెషల్ అని అంటున్నారు చైతన్య. 45 ఏళ్లు వచ్చాక పూర్తిగా గోవాకి షిఫ్ట్ కావాలని అనుకుంటున్నారట. ఏడాదికి ఒక సినిమా చేస్తూ గోవాలో సెటిల్ కావాలన్నది ప్రస్తుతానికి చైతూ కల. అందుకోసం ఇప్పటి నుంచి పక్కా ప్లానింగ్‌తో ఉన్నారట చైతూ అక్కినేని.