- Telugu News Photo Gallery Cinema photos Nabha natesh shared beautiful photos on the occasion of Vinayaka Chavithi
Nabha Natesh: బొజ్జగణపయ్యతో ముద్దుగుమ్మ.. ఆకట్టుకుంటున్న నభా నటేష్ ఫోటోలు
నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది క్రేజీ బ్యూటీ నభా నటేష్. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఆతర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కానీ అవి కూడా ఈ చిన్నదానికి హిట్ అందించలేకపోయాయి. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది నభా నటేష్. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నాభా అందంతో ఆకట్టుకుంది. ఈ అమ్మడు గ్లామర్ షోకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
Updated on: Sep 19, 2023 | 1:59 PM

నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది క్రేజీ బ్యూటీ నభా నటేష్. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఆతర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కానీ అవి కూడా ఈ చిన్నదానికి హిట్ అందించలేకపోయాయి.

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది నభా నటేష్. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నాభా అందంతో ఆకట్టుకుంది. ఈ అమ్మడు గ్లామర్ షోకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.

ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నదానికి ఇస్మార్ట్ శంకర్ సినిమా రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. రవి తేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో నటించినా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గ బోల్తాకొట్టింది.

చివరిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో కనిపించింది నభా నటేష్. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. దాంతో నాభా నటేష్ కు సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో సోషల్ మీడియాతో గడిపేస్తోంది ఈ చిన్నది.

సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ.. రకరకాల ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది ఈ బ్యూటీ. దర్శక నిర్మాతలను ఆకట్టుకునేలా ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా వినాయక చవితి సందర్భముగా బొజ్జ గణపయ్యతో ఫోటోలు దిగింది నభా నటేష్. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




