- Telugu News Photo Gallery Cinema photos Movie Lovers focus on Sankranthi 2024 Telugu Movies Release in Tollywood Telugu Entertainment Photos
Sankranthi 2024 Movies: మాట మార్చిన ప్రభాస్.. సంక్రాంతి ని టార్గెట్ చేస్తున్న మూవీ లవర్స్.
మాట మార్చిన ప్రభాస్.. మళ్లీ సంక్రాంతి మీద ఫోకస్ పెంచుతున్నా డార్లింగ్... ప్రభాస్ పోటీలో లేకపోవడంతో డైలమాలో పడ్డ జవాన్.. డీటైల్స్ చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. ముందు అనుకున్నదే... డార్లింగ్ పండక్కి వస్తారని. కాకపోతే రారేమో అనే డౌట్ వినిపించింది మొన్నీమధ్య. అరే.. అలాంటిదేమీ లేదు. రావడం పక్కా.. కాకపోతే సినిమా పేరు మారుతుందంతే.. అని ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్ చెప్పేశారు డార్లింగ్.
Updated on: Sep 03, 2023 | 4:04 PM

మాట మార్చిన ప్రభాస్.. మళ్లీ సంక్రాంతి మీద ఫోకస్ పెంచుతున్నా డార్లింగ్... ప్రభాస్ పోటీలో లేకపోవడంతో డైలమాలో పడ్డ జవాన్.. డీటైల్స్ చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత.

ముందు అనుకున్నదే... డార్లింగ్ పండక్కి వస్తారని. కాకపోతే రారేమో అనే డౌట్ వినిపించింది మొన్నీమధ్య. అరే... అలాంటిదేమీ లేదు. రావడం పక్కా.. కాకపోతే సినిమా పేరు మారుతుందంతే... అని ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్ చెప్పేశారు డార్లింగ్. రెబల్ సైన్యం ఖుషీగా ఉన్నారు. మిగిలిన హీరోల ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి?

అంతా బావుంటే సంక్రాంతికి కల్కి రిలీజ్ కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ వర్క్ ఇంకా బ్యాలన్స్ ఉండటంతో సారీ అనేశారు నాగీ. ఎలాగూ ప్రభాస్ పక్కకు జరిగారు కదా అని వరుసగా ఖర్చీఫులు వేశారు మిగిలిన సినిమాల మేకర్స్. వాళ్లందరి సంగతేమో గానీ నేను మాత్రం సలార్‌తో వస్తున్నా అంటూ హింట్స్ ఇస్తున్నారు ప్రభాస్. ఈ నెల 28న విడుదల కావాల్సిన సలార్‌ని ఫ్రెష్‌గా పండక్కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్

2024 సంక్రాంతి సీజన్‌నే టార్గెట్ చేసింది హనుమాన్. ఆల్రెడీ విడుదలైన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి త్రీడీ పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ రంగంలోకి దిగితే, హనుమాన్ పరిస్థితి ఏంటనే విషయం మీద కన్‌ఫ్యూజన్ నడుస్తోంది.

త్వరలోనే టైగర్ నాగేశ్వరరావుతో లక్‌ని టెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు రవితేజ. ఆల్రెడీ ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో సక్సెస్ చూశారు మాస్ మహరాజ్. నెక్స్ట్ సంక్రాంతికి ఈగిల్‌ని రెడీ చేస్తున్నారు. డిఫరెంట్ టైటిల్‌తో అట్రాక్ట్ చేస్తోంది ఈగిల్. రెండు మూడు సీన్ల మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. డార్లింగ్ మూవీ వచ్చినా ఈగిల్ డేరింగ్‌గా బరిలోకి దిగుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

ఖుషితో ఫుల్ ఖుషీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ఐ యామ్ బ్యాక్ అంటున్న ఆయన అదే ఆనందంతో సంక్రాంతికి పరశురామ్ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ గీతగోవిందంలాంటి సక్సెస్ చూసిన కాంబినేషన్ కావడంతో ఈ మూవీ మీద ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. పక్కా పండగ సినిమా అనే స్టాంప్ వేస్తున్నారు వీడీ ఫ్యాన్స్.

ఒక్క మాట చెప్పినా, పండగ తెచ్చే మాట చెప్పారు అంటూ మహేష్‌బాబుని పొగిడేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రావడం పక్కా అని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు మహేష్. సంక్రాంతికి రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమాను మించి గుంటూరు కారం మూవీని ట్రెండ్ చేస్తామని అంటున్నారు ఫ్యాన్స్.

ఇన్ని సినిమాల అనౌన్స్ మెంట్ల మధ్య, ప్రభాస్ సలార్ ఎంట్రీ ఇవ్వడంతో... 2024 పండక్కి వచ్చేదెవరు? వెనక్కి తగ్గేదెవరన్న కన్‌ఫ్యూజన్ మాత్రం క్రియేటైంది ఫిల్మ్ నగర్‌లో.





























