- Telugu News Photo Gallery Cinema photos Mirnalini ravi latest beautiful photos goes viral on internet
భక్తి భావనలో మునిగి తేలుతున్న కుర్ర హీరోయిన్.. మృణాళిని రవి లేటెస్ట్ పిక్స్
మృణాళిని రవి ప్రధానంగా తమిళం మరియు తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది. ఈ చిన్నది 2019లో విడుదలైన తమిళ చిత్రం సూపర్ డీలక్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. అంతకుముందు సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ మరియు టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయింది. తెలుగులో ఈ బ్యూటీ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చేసింది.
Updated on: Aug 07, 2025 | 1:40 PM

మృణాళిని రవి ప్రధానంగా తమిళం మరియు తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది. ఈ చిన్నది 2019లో విడుదలైన తమిళ చిత్రం సూపర్ డీలక్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. అంతకుముందు సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ మరియు టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయింది.

ఈ అమ్మడి సోషల్ మీడియాలో వీడియోలు చూసి దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా మృణాళినికి సూపర్ డీలక్స్‌లో అవకాశం ఇచ్చాడు. తెలుగులో ఈ బ్యూటీ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ (2019) చిత్రంలో బుజ్జమ్మ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాత్రకు ఆమె SIIMA అవార్డు ఉత్తమ సహాయ నటి (తెలుగు) నామినేషన్ అందుకుంది.

చాంపియన్ (2019, తమిళం), విశాల్ తో కలిసి ఎనిమీ , జాంగో (2021), చియాన్ విక్రమ్ తో కలిసి కోబ్రా (2022), సుధీర్ బాబు తో మామా మశ్చీంద్ర సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది మృణాళిని

మృణాళిని పాండిచ్చేరిలో జన్మించింది, బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందింది. నటనపై ఆసక్తితో IBMలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తుంది.రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.




