ఏం అందం గురూ.. గ్రీన్ చీరలో మెహ్రీన్‌ను చూస్తే చూపుతిప్పుకోలేము..
అందాల చిన్నది మెహ్రీన్ ఫిర్జాతా యూత్‌ను తన వైపుకు తిప్పుకోవడానికి రెడీ అయిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్రీన్ కలర్ చీరలో బ్యూటిఫుల్ లుక్‌లో ఉన్న ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు.
Updated on: Oct 23, 2025 | 3:14 PM

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు టాలీవుడ్‌లో చాలా సినిమాలే చేసింది కానీ స్టార్ హీరోయిన్‌గా మాత్రం గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ చిన్నది అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి అక్కడ ఫుల్ బిజీ అయిపోతుంది.

మెహ్రీన్ ఫిర్జాదా, 2016లో వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది, తన ఫస్ట్ సినిమాతోనే అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో అందరినీ తనవైపు లాక్కుంది. ఆ తర్వాత ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

ఇక ఈ సినిమా తర్వాత మెహ్రీన్‌కు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో వరస సినిమాలతో ఫుల్ బిజీ అవుతుంది, స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ ముద్దుగుమ్మ కెరీర్ డౌన్ ఫాలోఅయ్యింది.

మొదటి సినిమా సూపర్ హిట్ అందుకుంది. తర్వాత చేసిన సినిమాల్లో చాలా వరకు ఫ్లా్ప్ అయ్యాయి. మహానుభావుడు, ఎఫ్2, ఎఫ్3 వంటివి మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు కూడా ఆపర్స్ రావడమే కరువైపోయింది. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి అక్కడ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా గ్రీన్ కలర్ శారీలో అందంగా ముస్తాబై, తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



