- Telugu News Photo Gallery Cinema photos Megastar chiranjeevi Viswambhara and balakrishna movie shooting details
భాగ్యనగరంలో చిరు.. రాజస్థాన్ లో బాలయ్య… ఏం చేస్తున్నారో తెలుసా ??
టాలీవుడ్ షూటింగులతో కళకళలాడుతోంది. పెద్దా, చిన్నా తేడా లేకుండా హీరోలందరూ మేకప్ వేసుకుని బిజీ బిజీగా కనిపిస్తున్నారు. స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటూ కెప్టెన్లు అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. ఇంతకీ ఏ హీరో ఏ సెట్లో ఉన్నారో చూద్దామా...మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జైపూర్ ప్యాలస్‌లో ఉన్నారు.
Updated on: Jul 24, 2024 | 9:04 PM

సంక్రాంతి రిలీజ్ అంటూ టీమ్ క్లారిటీ ఇచ్చినా.. సోషల్ మీడియాలో వాయిదా వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత.. మెగా టీమ్ ఏమంటోంది.

ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉంది. సో, పూరి చెప్పే కథ నచ్చితే వెంటనే సినిమా చేయడానికి బాలయ్య కాల్షీట్ ఇచ్చేస్తారనే మాట కూడా గట్టిగానే వైరల్ అవుతోంది. అదే జరిగితే ఇబ్బందుల్లో ఉన్న పూరి కెరీర్‌కి భరోసా కల్పించాల్సిన హీరో బాలయ్యే అవుతారు.

శర్వానంద్ సినిమాను శంషాబాద్ పరిసరాల్లో చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ షూటింగ్ కూడా అక్కడే సాగుతోంది. నందమూరి కల్యాణ్‌రామ్ లేటెస్ట్ సినిమా షూటింగ్ అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో జరుగుతోంది. వరుణ్‌తేజ్ మట్కా సినిమాను వైజాగ్‌లో తెరకెక్కిస్తున్నారు డైరక్టర్ కరుణకుమార్.

ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్వయంభు షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది.

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం షూటింగ్ అమలాపురం పరిసరాల్లో జరుగుతోంది. ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్‌తో మెప్పిస్తున్నారు సరిపోదా శనివారం టీమ్.




