- Telugu News Photo Gallery Cinema photos Megastar chiranjeevi focus away from mass action films video
Chiranjeevi: ఇకపై ఆ సినిమాలకు చిరంజీవి దూరం.. ఆ జోనర్ పైనే ఫోకస్ చేస్తానంటున్న మెగాస్టార్
బోలా శంకర్ తర్వాత చిరంజీవి ఒకే జోనర్ లోనే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయారా? కొన్నాళ్ళు అలాంటి సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఎంత మంచి దర్శకుడు వచ్చినా కూడా ఆ జోనర్ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదా? రాబోయే రెండు మూడేళ్ల పాటు ఆ ఒక్క జోనర్ పైనే ఫోకస్ చేయాలని ఫిక్స్ అయిపోయారా? మరి చిరును ఆకర్షిస్తున్న ఆ జోనర్ ఏంటి? ఒక్క సినిమాతో చిరంజీవిలో చాలా మార్పులే వచ్చాయి.
Updated on: May 24, 2025 | 2:40 PM

ముఖ్యంగా బోలా శంకర్ తర్వాత రీమేక్ సినిమాలకు నో అంటున్నారు. అందుకే కళ్యాణ్ కృష్ణ తో చేయాల్సిన సినిమాను కూడా పక్కన పెట్టారు. అలాగే రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలకు కొన్నాళ్ళు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు.

జగదేకవీరుడు, అతిలోకసుందరి, అంజీ తర్వాత తన కెరీర్ లో ఎప్పుడు సోషియో ఫాంటసీ సినిమాలు చేయలేదు చిరంజీవి. ఇన్నేళ్ల తర్వాత వసిష్ఠ తో ఆ జోనర్ లోకి వెళ్లారు మెగాస్టార్. ఆ చిత్రం షూటింగ్ పూర్తైంది. త్వరలోనే డేట్ కూడా ప్రకటించనున్నారు మేకర్స్.

దాంతో పాటు అనిల్ రావిపుడి సినిమాను అనౌన్స్ చేశారు చిరంజీవి. అనిల్ రావిపుడి సినిమా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోనర్ లోనే. అందులో ఎలాంటి లాజిక్స్ ఉండవు. హాయిగా సంక్రాంతికి ఫ్యామిలీస్ తో పాటు రెండున్నర గంటలు నవ్వుకునే సినిమా చేస్తున్నారు అనిల్ చిరు.

ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహాలో సాగే అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. బోళా శంకర్ తర్వాత మాస్ యాక్షన్ సీరియస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు చిరు.

అందుకే అనిల్ రావిపుడితో సరదా సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బాబీతోనూ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నారు. 2026 లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఈ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది.




