- Telugu News Photo Gallery Cinema photos Mega heroes are focusing on taking shankar title for upcoming films
Sai Dharam Tej: ఆ ఒక్క పేరుపైన ఫోకస్ చేస్తున్న మెగా హీరోలు
కొన్నిసార్లు తెలియకుండానే కొన్ని టైటిల్స్‌కు బాగా అడిక్ట్ అయిపోతుంటారు హీరోలు. ఇప్పుడు మెగా హీరోల విషయంలో ఇదే జరుగుతుంది. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా ఓ పేరుకు బాగా కనెక్ట్ అయిపోయారు మెగా హీరోలు. చిరంజీవి నుంచి మొదలుపెట్టి పవన్, సాయి ధరమ్ తేజ్ వరకు అదే కంటిన్యూ చేస్తున్నారు. వాళ్లను అంతగా ఆకట్టుకున్న ఆ పేరేంటో తెలుసా..? ఓ సినిమా ముందు ఆడియన్స్‌లో బాగా రిజిష్టర్ అవ్వాలంటే బాగుండాల్సింది టైటిల్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Oct 10, 2023 | 4:05 PM

కొన్నిసార్లు తెలియకుండానే కొన్ని టైటిల్స్‌కు బాగా అడిక్ట్ అయిపోతుంటారు హీరోలు. ఇప్పుడు మెగా హీరోల విషయంలో ఇదే జరుగుతుంది. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా ఓ పేరుకు బాగా కనెక్ట్ అయిపోయారు మెగా హీరోలు. చిరంజీవి నుంచి మొదలుపెట్టి పవన్, సాయి ధరమ్ తేజ్ వరకు అదే కంటిన్యూ చేస్తున్నారు. వాళ్లను అంతగా ఆకట్టుకున్న ఆ పేరేంటో తెలుసా..?

ఓ సినిమా ముందు ఆడియన్స్‌లో బాగా రిజిష్టర్ అవ్వాలంటే బాగుండాల్సింది టైటిల్. అది కానీ పర్ఫెక్టుగా పడిందంటే దెబ్బకు సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి.

అందులోనూ మెగా హీరోల సినిమాలకు టైటిల్స్ అంటే చిన్న విషయం కాదు. ఈ క్రమంలోనే శంకర్ అనే పేరుపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మెగా హీరోలు. పవన్, చిరు అంతా ఇదే దారిలో వెళ్తున్నారు.

తాజాగా సాయి ధరమ్ తేజ్ సినిమాకు గాంజా శంకర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. విరూపాక్షతో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తేజ్.. బ్రోతో నిరాశ పరిచారు. కానీ అది పవన్ సినిమాగానే ప్రమోట్ చేసారు కాబట్టి తేజ్ కెరీర్‌పై పెద్దగా ప్రభావం చూపించలేదు.

రచ్చ, బెంగాల్ టైగర్ తర్వాత సంపత్ నందికి ఆ రేంజ్ సినిమాలేవీ రాలేదు. దాంతో తేజ్‌తో గాంజా శంకర్ అంటూ పక్కా మాస్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. గతంలో శంకర్ దాదా ఎంబిబిఎస్, జిందాబాద్‌లతో పాటు భోళా శంకర్ అంటూ చిరు శంకర్ టైటిల్‌ను బాగానే ఇష్టపడ్డారు. అలాగే పవన్ గుడూంబా శంకర్‌గా వచ్చారు. ఇప్పుడు గాంజా శంకర్‌గా తేజ్ వస్తున్నారు.





























