- Telugu News Photo Gallery Cinema photos Mad movie gets super hit talk indian 2 movie busy in dubbing
Tollywood: బ్లాక్‌బస్టర్ కొట్టిన మ్యాడ్ మూవీ.. డబ్బింగ్ పనుల్లో ఇండియన్ 2
శంకర్ ఇటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు అటు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలకు ఒకేసారి పని చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న శంకర్.. ప్రస్తుతం ఇండియన్ 2 డబ్బింగ్ పనుల్లో నిమగ్నమైపోయారు. ప్రస్తుతం ఈ డబ్బింగ్ సెషన్‌కు సంబంధించిన వీడియో విడుదలైంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన అక్టోబర్ 9 రాత్రి మరణించారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. దిల్ రాజుకు టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేసారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Oct 10, 2023 | 3:26 PM

Indian 2: శంకర్ ఇటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు అటు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలకు ఒకేసారి పని చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న శంకర్.. ప్రస్తుతం ఇండియన్ 2 డబ్బింగ్ పనుల్లో నిమగ్నమైపోయారు. ప్రస్తుతం ఈ డబ్బింగ్ సెషన్‌కు సంబంధించిన వీడియో విడుదలైంది.

Dil Raju: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన అక్టోబర్ 9 రాత్రి మరణించారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. దిల్ రాజుకు టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేసారు.

MAD: సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ హీరోలుగా తెరకెక్కిన మ్యాడ్ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ వారం సినిమాల్లో సైలెంట్ సెన్సేషన్ ఇది. పూర్తిగా కాలేజ్ నేపథ్యంలో మ్యాడ్ సినిమాను తెరకెక్కించారు కళ్యాణ్ శంకర్. ఈ సినిమా సక్సెస్ మీట్ తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించారు.

Prema Vimanam: సంగీత్ శోభన్, సాన్వీ మేఘన, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో సంతోష్ కాటా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రేమ విమానం’. తాజాగా ఈ చిత్రం నుంచి దొరసాని అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్న పిల్లలు, కొత్త జీవితం కోసం ఫ్లైట్ ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంటను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు.

Unstoppable: నందమూరి బాలకృష్ణ హోస్టుగా ఆహాలో వచ్చిన సెన్సేషనల్ టాక్ షో అన్‌స్టాపబుల్. ఇప్పటికే రెండు సీజన్స్ ముగిసాయి. తాజాగా మూడో సీజన్‌కు సైన్ చేసారు బాలయ్య. దసరాకు మొదటి ఎపిసోడ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. మూడో సీజన్‌లో మొదటి ఎపిసోడ్ భగవంత్ కేసరి టీం రానుంది. కాజల్, శ్రీలీల, అనిల్ రావిపూడి ఓ షోకు రానున్నారు.





























