- Telugu News Photo Gallery Cinema photos Malayalam Movie Actress Bhavya Trikha Beautifull Looks In Saree Photos Goes Viral
Bhavya Trikha: అరెరే.. చీరకట్టులో ముగ్దులను చేస్తోన్న అందాల వయ్యారి.. తెలుగులోకి రావొచ్చుగా అమ్మడు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య కేరళ అమ్మాయిల హవా ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి అడుగుపెడుతున్న ముద్దుగుమ్మలు అటు సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అందులో భవ్య త్రిఖ ఒకరు. ఈ అమ్మడి పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు.. కానీ ఆ బ్యూటీ నటించిన సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకుంది.
Updated on: Jul 23, 2024 | 12:36 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య కేరళ అమ్మాయిల హవా ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి అడుగుపెడుతున్న ముద్దుగుమ్మలు అటు సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అందులో భవ్య త్రిఖ ఒకరు.

ఈ అమ్మడి పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు.. కానీ ఆ బ్యూటీ నటించిన సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. తమిళంలో విడుదలైన జో సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది భవ్య త్రిఖ.

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై భారీ వసూళ్లు రాబట్టిన జో చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. రియో రాజ్ జోడిగా నటించిన భవ్య త్రిఖ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఇటు తెలుగులోనూ భవ్యకు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతకుముందు పలు చిత్రాల్లో నటించిన భవ్య.. జో సినిమాతో మాత్రం మంచి పాపులారిటినీ సొంతం చేసుకుంది. అటు సోషల్ మీడియాలోనూ భవ్యకు మంచి క్రేజ్ ఉంది.

ఇన్ స్టాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే భవ్య.. తాజాగా చీరకట్టులో ఫోటోస్ షేర చేసింది. ఈ బ్యూటీ లేటేస్ట్ లుక్స్ ఆకట్టుకుంటుండగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ బ్యూటీ తెలుగులో సినిమా చేయొచ్చుగా అంటూ నెటిజన్స్ కోరుతున్నారు.




