- Telugu News Photo Gallery Cinema photos Makers are planning to make the announcement videos go viral
Announcement: అదిరిపోయేలా అనౌన్స్‌మెంట్స్.. వీడియోస్ తో నయా ట్రెండ్ సెట్..
అనౌన్స్‌మెంట్ ఎవరైనా చేస్తారు.. కానీ దాన్ని కూడా యాడ్స్‌లో చెప్పినట్లు చాలా అందంగా, ఆకర్షనీయంగా చేసినపుడే కదా ఆడియన్స్ చూపు వాటిపై పడుతుంది. అందుకే అదే చేస్తున్నారిప్పుడు మన దర్శకులు. సినిమా సింపుల్‌గానే ఉన్నా.. ప్రమోషన్స్ మాత్రం డిఫెరెంట్‌గా చేస్తున్నారు. ముఖ్యంగా అనౌన్స్‌మెంట్ వీడియోలే అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ కథేంటో చూద్దామా..?
Updated on: May 21, 2024 | 4:18 PM

ఓ సినిమాను తీయడం కాదు.. తీసిన సినిమాను ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటున్నాం అనే దానిపైనే దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పెద్ద సినిమాలైతే ఓకే కానీ చిన్నోళ్లకు ప్రమోషనే ప్రాణం. అందుకే కొందరు దీన్నే గట్టిగా ఫాలో అవుతున్నారు. తాజాగా లవ్ మీ సినిమానే తీసుకోండి.. ట్రైలర్ రిలీజ్ కోసమే ఓ ఫన్నీ వీడియో చేసారు దర్శక నిర్మాతలు.

దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న లవ్ మీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్. మే 25న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండి ప్రమోషన్స్ వరకు అన్ని డిఫరెంట్ వేలో ప్లాన్ చేసారు.

ఇదే కాదు.. గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న ఆయ్ సినిమా ప్రమోషన్స్ కూడా డిఫెరెంట్‌గానే ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ లాంఛ్ నుంచి ప్రతీ వీడియోను ఆసక్తికరంగా డిజైన్ చేస్తున్నారు దర్శకుడు అంజి. వీటికి రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది.

మొన్నటికి మొన్న బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తాత పాత్ర కోసం బ్రహ్మానందంను ఒప్పించడానికి గౌతమ్, వెన్నెల కిషోర్ చేసిన చిన్న వీడియో చాలా వైరల్ అయింది. మొత్తానికి సినిమా ఎలా ఉన్నా.. ముందు అనౌన్స్‌మెంట్ వీడియోలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మేకర్స్.