- Telugu News Photo Gallery Cinema photos Major actress Sobhita Dhulipala details Her Age Family Husband Movies Latest Photos
Sobhita Dhulipala: మేజర్ మూవీలో నటించిన శోభిత మన తెలుగమ్మాయే.. ఆమె గురించి ఇంట్రస్టింగ్ డీటేల్స్
శోభితా ధూళిపాళ.. మత్తెక్కించే కళ్లు.. మైమరింపజేసే అందం.. మెస్మరేజ్ చేసే యాక్టింగ్.. ఈ మధ్య ఈ బ్యూటీ పేరు నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం...
Updated on: Jun 21, 2022 | 3:50 PM

శోభిత ధూళిపాల.. ఈ సుందరాంగి ఈ మధ్య కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేస్తుంది. ఈమె తెలుగమ్మాయే అని చాలామందికి తెలియదు. 1992 మే 31 తెనాలిలో పుట్టింది. వైజాగ్‌లో పెరిగింది.

భరతనాట్యం, కూచపుడి డ్యాన్స్ నేర్చుకున్న శోభిత.. 2013లో ఫెమినా మిస్ఇండియా టైటిల్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ముంబై వెళ్లింది.

అనురాగ్ కశ్యప్ తీసిన 'రామన్ రాఘవ్ 2.0' బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శోభిత.. ఆ తర్వాత 'చెఫ్', 'ది బాడీ', 'ఘోస్ట్ స్టోరీస్' వంటి హిందీ చిత్రాలతో మెప్పించింది. మేడిన్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరిస్‌లో కీ రోల్ చేసింది.

తెలుగులో అడవి శేష్ కథానాయకుడిగా వచ్చిన 'గూఢచారి', 'మేజర్' చిత్రాల్లో కీ రోల్స్ పోషించింది. మలయాళ చిత్రం 'కురుప్' తో నటిగా మరో మెట్టు ఎక్కింది.

ప్రజంట్ 'పొన్నియన్ సెల్వన్', 'సితారా', ఇంగ్లీష్లో 'మంకీ మ్యాన్'చిత్రాల్లో నటిస్తోంది శోభిత. కాగా ఈ నటి ఓ యువ హీరోతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.




