- Telugu News Photo Gallery Cinema photos Leonardo DiCaprio's iconic 'Titanic' costume Going Up For Sale in November
Titanic Costume at Auction: ‘టైటానిక్’లో జాక్-రోజ్ ధరించిన దుస్తులకు వేలంపాట.. కోట్ల రూపాయల్లో అమ్మకాలు
జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన 'టైటానిక్' ప్రపంచ సినిమా చరిత్రలోనే ఓ మైలురాయి. అందమైన ప్రేమ కథ సినీ ప్రియులను ఎంతగానో ఆకర్షించింది. ఇక టైటానిక్‌లో జాక్-రోజ్‌ల విషాదాంత ప్రేమ కథ సినీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ మువీ డిసెంబర్ 19, 1997న విడుదలవ్వగా అప్పటా కాలంలోనే బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసింది. 'టైటానిక్' చిత్రంలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ హీరోహీరోయిన్లుగా..
Updated on: Oct 09, 2023 | 9:09 PM

జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన 'టైటానిక్' ప్రపంచ సినిమా చరిత్రలోనే ఓ మైలురాయి. అందమైన ప్రేమ కథ సినీ ప్రియులను ఎంతగానో ఆకర్షించింది. ఇక టైటానిక్‌లో జాక్-రోజ్‌ల విషాదాంత ప్రేమ కథ సినీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ మువీ డిసెంబర్ 19, 1997న విడుదలవ్వగా అప్పటా కాలంలోనే బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసింది.

'టైటానిక్' చిత్రంలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ హీరోహీరోయిన్లుగా నటించారు. 1997లో విడుదలైన జేమ్స్ కెమెరూన్ అద్భుత సృష్టి టైటానిక్ మువీలో రోజ్-జాక్ పాత్రల్లో వీరు జీవించేశారు. తాజాగా ఈ చిత్రంలో జాక్ (లియోనార్డో డికాప్రియో) ధరించిన దుస్తులు వేలానికి వచ్చాయి. డికాప్రియో ధరించిన బట్టలు కోట్ల రూపాయల ధర పలకనున్నట్లు సమాచారం.

టైటానిక్‌లో డికాప్రియో ధరించిన సస్పెండర్‌లతో కూడిన కార్డ్‌రోయ్ ప్యాంటు, కాలర్‌లెస్ వైట్ షర్ట్, చొక్కా వేలానికి ఉంచారు. కేవలం డికాప్రియో దుస్తులకే దాదాపు రూ.2 కోట్లు రానున్నట్లు అంచనా. ఈ వేలం నవంబర్ 9 నుంచి 12 వరకు లండన్‌లో జరగనుంది.

అలాగే టైటానిక్ సినిమా హీరోయిన్ కేట్ ధరించిన డ్రెస్ కూడా వేలానికి వచ్చింది. డికాప్రియో ధరించిన ఓవర్ కోట్‌ను వేలానికి పెట్టారు. ఈ దుస్తులను సెప్టెంబర్ 13న ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు.

టైటానిక్‌లో వాడిన కస్ట్యూమ్‌తోపాటు పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్‌లో యాక్షన్ సన్నివేశాల సమయంలో జానీ డెప్ ధరించిన దుస్తులు, స్టార్ వార్స్‌లో కొన్ని ప్రత్యేక దుస్తులు, ఫారెస్ట్ గంప్‌లో టామ్ హాంక్స్ ధరించిన స్నీకర్స్ వంటి అనేక వస్తువులు ఈ వేలంలో అమ్మనున్నారు.




