- Telugu News Photo Gallery Cinema photos Krithi Shetty Shares Green Colour Saree Photos In Social Media
Krithi Shetty : కొంటె చూపులతో కవ్విస్తోన్న బేబమ్మ.. చీరకట్టులో కృతి శెట్టి వయ్యారాలు..
ఉప్పెన సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది కృతి శెట్టి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించి.. అందం, అభినయంతో ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. చూడముచ్చటగా కనిపిస్తూ..
Updated on: Sep 04, 2024 | 9:42 PM

ఉప్పెన సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది కృతి శెట్టి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించి.. అందం, అభినయంతో ఆకట్టుకుంది.

మొదటి సినిమాతోనే కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. చూడముచ్చటగా కనిపిస్తూ.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అలరించింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత క్లిక్ కాలేదు.

ఉప్పెన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. కానీ శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలు మినహా మిగతా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో బేబమ్మకు అవకాశాలు దూరమయ్యాయి.

ఇటీవలే మనమే సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ కూడా నిరాశ పరిచింది. ప్రస్తుతం మలయాళంలో ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఆకుపచ్చ చీరకట్టులో మరింత అందంగా మెరిసింది కృతి శెట్టి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.




