- Telugu News Photo Gallery Cinema photos Kota Bommali PS to Hi Nanna latest movie updates from film industry
Movie Updates: బ్లక్ బస్టర్ బొమ్మ కోటబొమ్మాళి.. హాయ్ నాన్న గురించి మేకర్స్..
శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా కోట బొమ్మాళి పీయస్. నాని తండ్రి పాత్రలో నటించిన సినిమా హాయ్ నాన్న. కె.విజయ్‌భాస్కర్ డైరక్ట్ చేస్తున్న సినిమా ఉషా పరిణయం. తాను పాతికేళ్లుగా బయట డిన్నర్లకు దూరంగా ఉన్నానని అన్నారు హీరో సల్మాన్‌ఖాన్. సంపూర్ణేష్‌బాబు, సంజోష్ అన్నదమ్ములుగా నటిస్తున్న సినిమా సోదరా.
Updated on: Nov 29, 2023 | 3:37 PM

శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా కోట బొమ్మాళి పీయస్. శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూస్తే ఆనందంగా అనిపించిందని అన్నారు మేకర్స్. పొలిటీషియన్లకు, పోలీసులకు మధ్య జరిగిన ఆసక్తికరమైన కథతో తెరకెక్కింది కోట బొమ్మాళి పీయస్

నాని తండ్రి పాత్రలో నటించిన సినిమా హాయ్ నాన్న. మృణాల్ హీరోయిన్‌గా నటించారు. బేబీ కియారా, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు మేకర్స్.

కె.విజయ్‌భాస్కర్ డైరక్ట్ చేస్తున్న సినిమా ఉషా పరిణయం. విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. తాన్వీ ఆకాంక్ష నాయిక. వీరిద్దరి మీద ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించి, సినిమాను ప్రారంభించారు. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. లవ్ ఈజ్ బ్యూటీఫుల్ అనేది మూవీ ట్యాగ్‌లైన్.

తాను పాతికేళ్లుగా బయట డిన్నర్లకు దూరంగా ఉన్నానని అన్నారు హీరో సల్మాన్‌ఖాన్. ఆయన నటించిన టైగర్3 ఇటీవల విడుదలైంది. కేవలం సినిమా షూటింగులకు, ప్రమోషన్లకు మాత్రమే బయటకు వెళ్తున్నట్టు తెలిపారు సల్మాన్. తన దృష్టిలో ఔట్‌డోర్ అంటే బాల్కనీలో కూర్చోవడం, ఫామ్‌హౌస్‌కి వెళ్లడమని చెప్పారు.

సంపూర్ణేష్‌బాబు, సంజోష్ అన్నదమ్ములుగా నటిస్తున్న సినిమా సోదరా. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని పాటను మంచు మనోజ్ విడుదల చేశారు. పాట బావుందని, సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు మనోజ్.




