- Telugu News Photo Gallery Cinema photos Know Pawan Kalyan Remuneration For HariHara Veeramallu Movie
Pawan Kalyan: హరిహర వీరమల్లు సినిమాకు పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా.. ?
టాలీవుడ్ అడియన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే.ఇక గత అర్దరాత్రి నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
Updated on: Jul 24, 2025 | 1:03 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ హరిహర వీరమల్లు. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. జూలై 24న ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది.

ఇన్నాళ్లు ఏ సినిమాకు చేయనంతగా ఈ మూవీకి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు పవన్. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్, రెండుసార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే హరి హర వీరమల్లు సినిమాపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇన్నాళ్లు ఏ సినిమాకు చేయనంతగా ఈ మూవీకి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు పవన్. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్, రెండుసార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే హరి హర వీరమల్లు సినిమాపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎంత పారితోషికం తీసుకున్నారో స్వయంగా ఆయనే చెప్పారు. తాజాగా రిపోర్టర్లతో ముచ్చటించిన పవన్.. రెమ్యునరేషన్ గురించి వచ్చిన ప్రశ్నపై స్పందిస్తూ.. ఈ సినిమా కోసం తాను ఒక్క పైసా కూడా తీసుకోలేదని అన్నారు.

నిర్మాతల కష్టాలు నాకు తెలుసు.. నేను వారికి గౌరవం ఇస్తాను అన్నారు. ఈ సినిమాకు ముందుగా పవన్ పారితోషికం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు అడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది.




