- Telugu News Photo Gallery Cinema photos Know about Orchha Fort in which Ponniyin Selvan 2 movie shooting took place and history of it associated with Lord Rama telugu cinema news
Orchha Fort: ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్ జరిగిన ఓర్చా రాజభవనం గురించి తెలుసా.. శ్రీరాముడితో ముడిపడి ఉన్న 600 ఏళ్ల చరిత్ర..
డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ చిత్రం. తమిళనాడులో ఈ నవల చాలా ఫేమస్. కల్కి కృష్ణమూర్తి (1899-1954) రచించిన పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మణి. ఇందులో త్రిష, చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలలో నటించారు.
Updated on: May 02, 2023 | 5:34 PM

డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ చిత్రం. తమిళనాడులో ఈ నవల చాలా ఫేమస్. కల్కి కృష్ణమూర్తి (1899-1954) రచించిన పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మణి. ఇందులో త్రిష, చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలలో నటించారు.

ఇప్పటికే విడుదలైన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, 2 సూపర్ హిట్ కావడమే కాకుండా.. చోళులలో ప్రసిద్ధుడైన రాజ రాజ చోళుడు-1 తండ్రి పరాంతక చోళుడు-2 కాలంలోని కొన్ని చారిత్రక సంఘటనలను ఈ సినిమాతో ప్రజల ముందుకు తీసుకువచ్చారు.

ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని మధ్యప్రదేశ్లో ఉన్న ఓర్చా రాజభవనంలో తెరకెక్కించారు. ఇది బుందేలా రాజ్ పుత్లో రాజధాని. ఓర్చా అనేది ఝాన్సీకి 20 కి.మీ దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం.

ఈ రాజభవనానికి 600 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఓర్చా భూమిలో వైతరణి నది.. రాజభవనాలు.. దేవలయాలు, కోటలతో ప్రవహిస్తుంది. ఈ ప్రదేశంలో రాముడిని రాజు అని పిలుస్తున్నారు. అయోధ్య రాముడికి. ఓర్చా రాజభవనానికి దగ్గరి సంబంధం ఉంది.

ఓర్చా రాణి రాముడికి అమితమైన భక్తురాలు.. ఆమె భక్తిని చూసిన రాజు ఓర్చాలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మించాడు. అందులో ప్రతిష్టించేందుకు అయోధ్య నుంచి శ్రీరాముని విగ్రహాన్ని తీసుకువచ్చి ప్యాలెస్ లో ప్రతిష్టించాడు. కానీ ఆలయం పూర్తైన తర్వాత అందులోకి విగ్రహాన్ని మార్చలేకపోయారు.

ఎన్నో సార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ ఆ విగ్రహాన్ని పైకి లేపలేకపోయారు. దీంతో ఆ రాజభవనాన్నే దేవాలయంగా మార్చారు. బుందేల్‌ఖండ్ రాజుల పరాక్రమానికి చిహ్నం ఓర్చాలోని ప్రధాన కోట. ఛత్రసల్ రాజు.. అతని కుమార్తె మస్తానీని గుర్తు చేస్తుంది ఈ కోట.

రాముడికి ఓర్చా కోట అంటే చాలా ఇష్టమని.. రాత్రిళ్లు అయోధ్యలో ఉండి.. ఉదయాన్నే ఓర్చాకి పిల్లవాడి రూపంలో వస్తాడని ఇప్పటికీ ప్రజల నమ్మకం.

ఓర్చా రాజభవనంలో జహంగీర్ మహల్, షీష్ మహల్, ఛత్రీలు నిర్మించారు. ఇవి బుందేల్ ఖండ్ పాలకుల వైభవానికి సంకేతమే కాకుండా.. ఇక్కడి చరిత్రను తెలియజేస్తాయి. ఓర్చాలో కొన్ని ప్రదేశాలలో, బేత్వా నది నీరు చాలా స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంది. నది గర్భంలో పడి ఉన్న చిన్న గులకరాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.

గ్వాలియర్ నుండి ఓర్చా వరకు 120 కిలోమీటర్లు మరియు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుండి దాదాపు 16 కిలోమీటర్లు. . ఢిల్లీ, గ్వాలియర్ మరియు వారణాసి నుండి ఓర్చాకు సాధారణ బస్సు సర్వీసులు ఉన్నాయి.

ఓర్చా ఝాన్సీ-ఖజురహో రహదారిపై ఉంది. ఖజురహో ఓర్చాకు సమీప విమానాశ్రయం. ఇది దాదాపు 163 కి.మీ. దూరంలో ఉంది.




