- Telugu News Photo Gallery Cinema photos KGF Hero Yash and Radhika Pandit celebrate Ugadi 2023 with kids and parents, Photos goes viral
Ugadi 2023: కేజీఎఫ్ హీరో యశ్ ఇంట్లో గ్రాండ్‌గా ఉగాది సెలబ్రేషన్స్.. వైరలవుతోన్న ఫొటోలు
పండుగ వేడుకల్లో యష్-రాధిక పిల్లలు కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఆయన ఇంట్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఫొటోలను చూసిన అభిమానులు యష్-రాధిక లకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Updated on: Mar 23, 2023 | 10:06 AM

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పర్వదినాన కేజీఎఫ్ హీరో యశ్, సతీమణి నటి రాధిక ఇళ్లు కూడా సందడిగా మారాయి. ఈ సందర్భంగా ఉగాది సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రాధిక.

రాధికా పండిట్ హ్యాపీగా ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. తన అభిమానులందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

పండుగ వేడుకల్లో యష్-రాధిక పిల్లలు కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఆయన ఇంట్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఫొటోలను చూసిన అభిమానులు యష్-రాధిక లకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

ఏ పండుగైనా యష్-రాధిక పండిట్ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా వారి ఇంట్లో సంక్రాంతి సంబరాలు జోరుగా జరిగాయి. ఆ సందర్భంగా ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి

కేజీఎఫ్: చాప్టర్ 2' తర్వాత యష్ కొత్త సినిమాను ప్రకటించలేదు. తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ ఖాళీ సమయాల్లో కుటుంబంతోనే ఎక్కువగా గడుపుతున్నాడు.





























