- Telugu News Photo Gallery Cinema photos Kavya Kalyan Ram latest sizzling photos goes viral in social media
Kavya Kalyan Ram: అందంతో హంస జతకడితే ఈ వయ్యారి రూపం.. సిజ్లింగ్ లుక్స్ వైరల్..
కావ్య కళ్యాణ్రామ్ తెలుగు చిత్రాలలో కనిపించే భారతీయ నటి. ఆమె నటన జీవితం తెలంగాణ, హైదరాబాద్‌లో బాల నటుడిగా ప్రారంభమైంది. స్నేహమంటే ఇదేరా అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా. ఆమె తదనంతరం గంగోత్రి, ఠాగూర్, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, పాండురంగడు మరియు ఉల్లాసంగా ఉత్సాహంగా సహా అనేక ఇతర చిత్రాలలో కనిపించింది. ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ ఉంటుంది ఈ ముద్దుగమ్మ. తాజా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని సిజ్లింగ్ పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.
Updated on: May 11, 2024 | 3:14 PM

13 జూలై 1992న ఆంధ్రప్రదేశ్ లోనే కొత్తగూడెంలో జన్మించింది అందాల తార కావ్య కళ్యాణ్ రామ్. హైదరాబాద్‌లో పెరిగింది. మహారాష్ట్రలోని పూణేలో సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి.

2001లో నాగార్జున, సుమంత్ ముల్టీస్టారర్ చిత్రం స్నేహమంటే ఇదేరా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ అరంగేట్రం చేసింది. 2003లో గంగోత్రిలో చిన్నప్పటి గంగోత్రి పాత్రలో, ఠాగూర్ లో చిరు పెంచుకున్న పిల్లల్లో ఒకరిగా ఆకట్టుకుంది.

తర్వాత అడవి రాముడులో ఆర్తి అగర్వాల్ చిన్నప్పటి పాత్రలో, విజయేంద్ర వర్మలో బాలయ్య కూతురి పాత్రలో మెప్పించింది. తర్వాత బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు, ఉల్లాసంగా ఉత్సహంగా వంటి చిత్రాల్లో బాలనటిగా కనిపించింది.

2022లో మసూదా అనే ఓ తెలుగు బ్లాక్ బస్టర్ హారర్ చిత్రంతో తొలిసారి హీరోయిన్ గా నటించింది ఈ వయ్యారి భామ. 2023లో బలగం, ఉస్తాద్ చిత్రాల్లో కథానాయకిగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. మూడు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.

ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ ఉంటుంది ఈ ముద్దుగమ్మ. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని సిజ్లింగ్ పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. వీటిని చుసిన కుర్రాళ్లు నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.





























