- Telugu News Photo Gallery Cinema photos Kannada Actress Rukmini Vasanth Will Got Another Chance In Manirathnam Next Project
Rukmini Vasanth: చేతిలో ఎన్టీఆర్ సినిమా.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ..
కేవలం ఒకే ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది ఈ హీరోయిన్. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. తనే హీరోయిన్ రుక్మిణి వసంత్. తాజాగా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్.
Updated on: May 21, 2025 | 5:28 PM

కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగారాలు దాచే ఎల్లో సైడ్ ఏ, బీ సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రుక్మిణి వసంత్. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తుఫానులా దూసుకెళ్తుంది. వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంటుంది.

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో ఈ ముద్దుగుమ్మ ఎంపికైందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అలాగే తమిళంలో విజయ్ సేతుపతి నటించిన ఏస్, మదరాసి చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది. థగ్ లైఫ్ సినిమా తర్వాత మణిరత్నం మరో రొమాంటిక్ చిత్రాన్ని ప్లాన్ చేశారట.

అందులో హీరోగా నవీన్ పోలిశెట్టి నటించనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఫిల్మ్ వర్గాల్లో మాత్రం ఎక్కువగా టాక్ నడుస్తోంది.

ఇక ఇదే నిజమైతే.. అటు ఎన్టీఆర్ సినిమాతోపాటు ఇప్పుడు తెలుగులో మణిరత్నం సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారనుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ హీరోయిన్. కన్నడ భాషతో కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుంది.




