- Telugu News Photo Gallery Cinema photos JR.NTR very confident about his movie Devara movie last 40 minutes Telugu Heroes Photos
JR.NTR – Devara: తారక్ మాటలతో దేవరపై కాన్ఫిడెన్స్ డబుల్.. అస్సలు మిస్ అవ్వదు.!
ట్రిపుల్ ఆర్ తర్వాత ప్యాన్ ఇండియా రిలీజ్ అంటే ఏ రేంజ్‌లో ఉండాలి.. మొత్తం నార్త్ టు సౌత్ మారు మోగిపోవాలి కదా.. మరి నిజంగానే దేవర అలా మారుమోగుతోందా.? మొన్న మొన్నటిదాకా ఏమోగానీ, ఇప్పుడు నార్త్ లో తారక్ నోరు విప్పి నప్పటి నుంచి మాత్రం మారుమోగిపోతోంది.. దేవర క్రేజ్ మామూలుగా లేదనే టాక్ మొదలైంది. మీరు ఎంతైనా ఊహించుకోండి.. అంతకు మించే ఉంటుంది సినిమాలో అనే హింట్స్ ఇచ్చేసింది దేవర టీమ్.
Updated on: Sep 12, 2024 | 8:18 PM

దానికితోడు హిందీలో పాపులర్ షోలకు కూడా గెస్టులుగా వెళ్తున్నారు తారక్ అండ్ టీం. ఈ క్రమంలోనే కపిల్ శర్మ షోకు వెళ్లారు.. ఈ ప్రోమో కూడా వైరల్ అవుతుందిప్పుడు. దాంతో పాటే సందీప్ వంగాతో పూర్తిగా బాలీవుడ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

కల్కి తర్వాత మరోసారి బాక్సాఫీస్ పోటెత్తాలంటే.. దేవర లాంటి సినిమా రావాల్సిందే. ట్రైలర్‌కు కాస్త నెగిటివ్ రెస్పాన్స్ వస్తున్నా.. అది కూడా ఒకందుకు మంచిదే అంటున్నారు మేకర్స్.

ఆచార్య తర్వాత కొరటాల శివ దేవరను ఎలా తెరకెక్కిస్తారోననే బెంగ ఎక్కడో ఓ మూలన ఉంది జనాలకు. కానీ ఇప్పుడు తారక్ మాటలు వింటుంటే.. కాన్ఫిడెన్స్ డబుల్ అవుతోంది.. అనుమానాలు అక్కర్లేదనే చర్చ ఊపందుకుంది.

దేవర సినిమా మొత్తం ఒక ఎత్తు... లాస్ట్ లో క్లైమాక్స్ ఇంకో ఎత్తు... ఇదీ తారక్ చెప్పిన మాట. ఏ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ గురించో చెప్పడం కాదు... ప్రతి పార్టూ అద్భుతంగా కంపోజ్ చేశారన్నది ఫ్యాన్స్ కి పండగ తెచ్చే న్యూస్.

మరీ ముఖ్యంగా చివరి అరగంటా, నలభై నిమిషాలు వేరే లెవల్లో ఉంటుందంటున్నారు తారక్. కొరటాల అసలు క్లైమాక్స్ ని అలా ఎలా ఊహించారా? అని ఆశ్చర్యపోయారట తారక్. అంతే కాదు,

తాను సెట్లో చేసిన ఎక్స్ పీరియన్స్ ని, ఫ్యాన్స్ థియేటర్లలో విట్‌నెస్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి భలే థ్రిల్లింగ్ గా ఉంటుందంటున్నారు మాన్ ఆఫ్ మాసెస్. సెప్టెంబర్ 27న విడుదల కానున్న దేవరకు నార్త్ లో ఊపు మొదలైంది.

సెప్టెంబర్ 27న దేవర విడుదల కానుంది. అయితే దానికంటే ఒకరోజు ముందే సెప్టెంబర్ 26న అమెరికా, లాస్ ఏంజెల్స్‌లోని బియాండ్ ఫెస్ట్ 2024లో దేవరను ప్రదర్శించబోతున్నారు. ఎంతోమంది హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ హాజరు కానున్న ఈ ఈవెంట్‌కు దేవర యూనిట్ హాజరు కానున్నారు.




