- Telugu News Photo Gallery Cinema photos Guess The Actor In This Photo He Is Hero Vijay Deverakonda Childhood Photo Goes Viral
Tollywood: తండ్రితో ఉన్న చిన్నోడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. ఎవరో తెలుసా..?
తండ్రి భూజాల పై ఉన్న ఆ చిన్నోడు ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. కట్ చేస్తే ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు.. ఆ కుర్రాడికి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇంతకీ ఎవరో తెలుసా ?.
Updated on: Sep 12, 2024 | 8:16 PM

తండ్రి భూజాల పై ఉన్న ఆ చిన్నోడు ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. కట్ చేస్తే ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు.. ఆ కుర్రాడికి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇంతకీ ఎవరో తెలుసా ?.. తనే విజయ్ దేవరకొండ.

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్ట్రర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీతో విజయ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, టాక్సీవాలా చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు.

ఖుషీ సినిమాతో మరోసారి విజయాన్ని ఖాతాలో వేసుకున్న విజయ్.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇందులో విజయ్ జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇటీవలే శ్రీలంకలో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన కల్కి 2898 ఏడీ చిత్రంలో అర్జునుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.




