- Telugu News Photo Gallery Cinema photos Heroine Tamanna Bhatia Opens Up About Past Breakup Stories In Latest Interview Telugu Actress Photos
Tamanna Bhatia: తన మొదటి రెండు బ్రేకప్ గురించి మాట్లాడిన మిల్కీబ్యూటీ తమన్నా.!
ఒక్కడుగు ముందుకేస్తే, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఏంటి? అనుకునే రోజులివి. అలా కాకుండా అన్నిటినీ బ్యాలన్స్ చేయడం అతి కొద్ది మందికి మాత్రమే అలవాటవుతుంది. ఇప్పుడు తమన్న మాటలను గమనించిన వారు ఆమె బ్యాలన్స్ చేస్తున్న తీరు కేక అంటున్నారు.. ఇంతకీ ఏ విషయంలో మిల్కీ బ్యూటీ ఇన్ని మార్కులు కొట్టేస్తున్నారో తెలుసా.? నాకు ఇప్పటికి రెండు సార్లు గుండె పగలింది..
Updated on: Sep 12, 2024 | 8:00 PM

ఒక్కడుగు ముందుకేస్తే, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఏంటి? అనుకునే రోజులివి. అలా కాకుండా అన్నిటినీ బ్యాలన్స్ చేయడం అతి కొద్ది మందికి మాత్రమే అలవాటవుతుంది. ఇప్పుడు తమన్న మాటలను గమనించిన వారు..

ఆమె బ్యాలన్స్ చేస్తున్న తీరు కేక అంటున్నారు.. ఇంతకీ ఏ విషయంలో మిల్కీ బ్యూటీ ఇన్ని మార్కులు కొట్టేస్తున్నారో తెలుసా.?

నాకు ఇప్పటికి రెండు సార్లు గుండె పగలింది అని ఇప్పటిదాకా ఎప్పుడూ చెప్పని విషయాన్ని గురించి మాట్లాడి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు నటి తమన్నా భాటియా.

తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డానంటూ ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ అయ్యారు. అంతే కాదు, రెండోసారి వద్దనుకున్న వ్యక్తి అబద్దాల కోరు అని ఓపెన్ అయ్యారు. తమన్నా అంతంత మాటలనేసరికి.. అందరూ విజయ్ వర్మ గురించేనని అనుకున్నారు.

దానికి తోడు వారిద్దరూ సోషల్ మీడియాల్లో ఒకరిని ఒకరు ఫాలో కాకపోవడంతో విషయం వెంటనే వైరల్ అయింది. ఫాలో కాకపోయినా.. ఎప్పటికప్పుడూ ఒకరి పోస్టులను ఒకరు లైక్ చేసుకుంటూనే ఉండటాన్ని గమనించిన వారూ లేకపోలేదు.

తమన్నా చెప్పింది మిస్టర్ విజయ్ గురించేనా? కాదా? అనే అనుమానం మాత్రం అలా మిగిలిపోయింది.! నార్త్ లో తన బ్రేకప్‌ల గురించి మాట్లాడిన తమన్నా.. పనిలో పనిగా సౌత్ ఇండస్ట్రీని పొగిడేశారు. ఇక్కడ కథలను ఎంపిక చేసుకునే తీరు,

వాటిని దర్శకులు అర్థం చేసుకునే విధానం, వాటిని తెరకెక్కించే వైనం అద్భుతం అని పొగిడేశారు. సౌత్ స్టోరీల్లో సోల్ ఉంటుంది. ఎమోషన్స్ ఉంటాయి. అందుకే అవి జనాలను తొందరగా కనెక్ట్ అవుతాయి.

స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తాయి అని తమన్నా మన వారిని నార్త్ లో పొగుడుతుంటే గూస్‌బంప్స్ వచ్చేస్తున్నాయంటున్నారు అభిమానులు. రీసెంట్‌గా స్త్రీ2, వేదలో నటించిన మిల్కీబ్యూటీకి సౌత్‌లోనూ మంచి సినిమాలే ఉన్నాయి.. కాకపోతే సూపర్‌డూపర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారంతే.




