- Telugu News Photo Gallery Cinema photos Jr ntr role in hrithik roshan war 2 movie know the details here
War 2: వార్ 2లో ఎన్టీఆర్ క్యారెక్టర్‌పై క్లారిటీ వచ్చిందిగా
జూనియర్ ఎన్టీఆర్ వార్ 2లో నటిస్తున్నారు.. ఏడాదిగా హైదరాబాద్ టూ ముంబై ట్రిప్పులు వేస్తూనే ఉన్నారు.. ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ కూడా పూర్తి కానుంది. అంతా బాగానే ఉంది కానీ ఇందులో అసలు తారక్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..? ఎన్టీఆర్‌ను వార్ 2లో అయన్ ముఖర్జీ ఎలా చూపించబోతున్నారు..? దీనిపై అప్‌డేట్ వచ్చిందిప్పుడు.
Updated on: Jan 30, 2025 | 7:20 PM

దేవర బ్లాక్‌బస్టర్ తర్వాత తారక్ ఫ్యాన్స్ మామూలు హైలో లేరు.. రాజమౌళి తర్వాతి సినిమాతో మా వాడు హిట్టు కొట్టాడంటూ గర్వంగా కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పుడు వార్ 2తో బాలీవుడ్‌ను కూడా కుమ్మేయాలని చూస్తున్నారు తారక్.

హృతిక్ రోషన్ లాంటి హీరో ఎదురుగా ఉన్నా.. తారక్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. వార్ 2లో హృతిక్ రోషన్ కంటే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ మరింత ఛాలెంజింగ్‌గా ఉంటుందని తెలుస్తుంది.

కబీర్‌గా ఇప్పటికే వార్ ఫ్రాంచైజీలో హృతిక్ క్యారెక్టర్‌పై ఓ క్లారిటీ ఉంది. కానీ తారక్ పాత్రపై క్లారిటీ లేదు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్‌తో ఉండబోతుందని తెలుస్తుంది.

గతంలో జై లవకుశలో తారక్ ఈ తరహా పాత్ర చేసారు. వార్ 2లో దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుడిగా ఉన్న తారక్.. ఆ తర్వాత ఎందుకు నెగిటివ్ షేడ్స్‌లోకి మారిపోయారనేది ఆసక్తికరంగా ఉండబోతుందని తెలుస్తుంది.

వార్‌లోనూ టైగర్ ష్రాఫ్ పాత్ర ముందు హీరోగా ఉండి.. చివరికి నెగిటివ్ షేడ్‌లోకి మారుతుంది. వార్ 2లోనూ ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలిక.. వార్ 2తో తారక్ ఏం చేయబోతున్నారో..?




