- Telugu News Photo Gallery Cinema photos Jr NTR and Janhvi Kapoor new movie NTR30 launch ceremony with Director Koratala Siva photos
NTR30: ఎన్టీఆర్ అభిమానులు గెట్ రెడీ.. వస్తున్నాం.. మాటిస్తున్నం.. రీసౌండ్ గట్టిగా వినిపిస్తాం..!
నందమూరి అభిమానులు నిరీక్షణకు తెరపడింది. ట్రిపులార్ లాంటి బిగ్ హిట్ తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా సెట్స్ మీదకు వచ్చింది. ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి, నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Updated on: Mar 23, 2023 | 6:46 PM

నందమూరి అభిమానులు నిరీక్షణకు తెరపడింది. ట్రిపులార్ లాంటి బిగ్ హిట్ తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా సెట్స్ మీదకు వచ్చింది.

ఈ రోజు ఉదయం ఐటీసీ కోహినూర్‌లో జరిగిన ఈవెంట్‌లో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.

ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్‌తో పాటు ఎన్టీఆర్ గత చిత్ర దర్శకుడు రాజమౌళి, నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నిర్మాతలు దిల్ రాజు, బీవియస్‌ఎన్ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని, ఏషియన్ సునీల్, అభిషేక్ ఆర్ట్స్ అభిషేక్ పాల్గొన్నారు.

వీరితో పాటు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్ లాంచింగ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.

పూజా కార్యక్రమాల్లో భాగంగా సీనియర్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి చేతుల మీదగా కొరటాల శివ స్క్రిప్ట్‌ను అందుకున్నారు.

ఎన్టీఆర్, జాన్వీ మీద తెరకెక్కించిన ముహూర్తపు షాట్‌కు రాజమౌళి క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను నందమూరి తారక రామరావు ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధా ఆర్ట్స్ బ్యానర్‌లో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.

గుర్తింపుకు నోచుకోని సముద్రపు తీరాల్లో భయం అన్నది ఎరుగని వారికి, భయాన్ని రుచి చూపిస్తాడు హీరో. మునుపెన్నడూ లేనంత గ్రాండియర్‌గా సినిమా ఉంటుంది.

ప్రపంచంలోని అత్యున్నతమైన వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలను బ్లాక్ చేస్తున్నామని అన్నారు దర్శకుడు కొరటాల శివ.ఏడాదిగా ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నట్టు తెలిపారు సంగీత సంచలనం అనిరుద్. ఐ యామ్ బ్యాక్ అంటూ హింట్ ఇచ్చారు.




