- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Anchor Rashmi Gautam Performs Special Pujas At Kashi, See Photos
Rashmi Gautham: వారణాసిలో జబర్దస్త్ యాంకర్ రష్మీ .. కాశీ విశ్వేశ్వరుడికిప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత కొన్నేళ్లుగా తన యాంకరింగ్ తో తెలుగు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోందీ అందాల తార. అలాగే అడపా దడపా సినిమాల్లోనూ నటిస్తోందీ అందాల తార. త్వరలోనే ఆమె నటించిన ఓ సినిమా రిలీజ్ కానుంది.
Updated on: Jul 10, 2025 | 11:13 PM

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత కొన్నేళ్లుగా తన యాంకరింగ్ తో తెలుగు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోందీ అందాల తార. అలాగే అడపా దడపా సినిమాల్లోనూ నటిస్తోందీ అందాల తార.

జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టాప్ టీవీ షోల్లోనూ సందడి చేస్తోన్న రష్మీ ప్రస్తుతం ఓ తెలుగు సినిమాలో మెయిన్ లీడ్ పోషిస్తోంది. ఆమె నటిస్తోన్న లేటెస్ట్ తెలుగు సినిమా వైతరణి.

అఖిల్ బాబు దర్శకత్వంలో ఎ.ఆర్.కాంతలక్ష్మి, ఆర్.రమేష్ బాబు వైతరణి సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో యాంకర్ రష్మితో పాటు ప్రదీప్ పల్లి లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు.

ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘భయానికి మరో పేరు.. వైతరణి’ అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేపుతోంది.

ప్రస్తుతం టీవీ షోస్, సినిమా షూటింగులతో బిజీగా ఉంటోన్న యాంకర్ రష్మీ ఉన్నట్లుండి వారణాసిలో ప్రత్యక్షమైంది. అక్కడ కొలువైన కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసింది.

ఈ సందర్భంగా తన కాశీ యాత్రకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది రష్మీ. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా రాసుకొచ్చిందీ అందాల తార. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.




