- Telugu News Photo Gallery Cinema photos Is there going to be a huge battle between Akhanda 2 and OG, which are set to release for Dasara?
Balakrishna vs Pawan Kalyan: బాలయ్య vs పవన్.. దసరా బరిలో భారీ సమరం తప్పదా.?
ఓజీ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది.. వీరమల్లు వచ్చిన మూడు నెలల్లోపే మరోసారి థియేటర్స్‌పై దండెత్తడానికి రెడీ అవుతున్నారు పవర్ స్టార్. అయితే ఓజి డేట్.. మరో హీరో సినిమాకు అడ్డంకిగా మారింది. ఆల్రెడీ అదే రోజు మరో బడా సినిమా డేట్ లాక్ చేసుకుంది. మరి ఈ పోరులో వెనక్కి తగ్గేదెవరు..? చివరి వరకు రేసులో నిలిచేదెవరు..?
Updated on: May 26, 2025 | 11:00 AM

ముందు నుంచి అనుకుంటున్నదే జరిగింది.. 2025లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్‌కు తెర లేవనుంది. సెప్టెంబర్ 25న ఒకేరోజు బడా హీరోలిద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటానికి సై అంటే సై అంటున్నారు. ఆల్రెడీ దసరా సీజన్ క్యాష్ చేసుకోడానికి మూన్నెళ్ల ముందే సెప్టెంబర్ 25 లాక్ చేసుకుంది అఖండ 2.

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కావడంతో అఖండ 2 మూవీపై అంచనాలు భీభత్సంగా ఉన్నాయి. అఖండ 2 బిజినెస్ కూడా నెక్ట్స్ లెవల్‌లో జరుగుతుంది. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

సెప్టెంబర్ 25 అంటే దసరా హాలీడేస్ కూడా కలిసొస్తాయి. అందుకే ఆ డేట్ లాక్ చేసారు మేకర్స్. ఇప్పుడు ఓజి అదే రోజు రాబోతుందని ప్రకటించారు డివివి ఎంటర్‌టైన్మెంట్స్. దాంతో బాలయ్య, పవన్ కళ్యాణ్ పోరు భారీగానే ఉండబోతుంది.

ముంబైలో ఓజి షెడ్యూల్ జరుగుతుంది. అందులో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌తో షూట్ పూర్తి కానుంది. రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి.. దసరాకు సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ముంబై బేస్డ్ మాఫియా డ్రామాగా వస్తుంది ఓజి. మరి చూడాలిక.. ఓజి, అఖండ 2లలో చివరివరకు రేసులో ఎవరు నిలబడతారో..?




