- Telugu News Photo Gallery Cinema photos Is it difficult for Kiara Advani to get offers in Telugu anymore
Kiara Advani: కియరాకు కలిసిరావడం లేదే పాపం..! తెలుగులో ఛాన్స్‌కు దక్కేనా.?
రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో కియారా అందాలు ఒలకబోసి ఫలితం లేకుండా పోయింది. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అక్కడ దాదాపు స్టార్ హీరోల సరసన నటించిస్టార్ గా ఎదిగింది.
Updated on: Feb 02, 2025 | 1:09 PM

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న కియారా అద్వానీ మహేశ్ బాబు భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే పక్కింటమ్మాయిగా పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడి అందానికి అందరూ ఫిదా అయ్యారు.

ఆతర్వాత రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో కియారా అందాలు ఒలకబోసి ఫలితం లేకుండా పోయింది. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది.

బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అక్కడ దాదాపు స్టార్ హీరోల సరసన నటించి ;స్టార్ గా ఎదిగింది. ఈ క్రమంలోనే మరోసారి తెలుగులో ఛాన్స్ అందుకుంది. రామ్ చరణ్ కు జోడీగా నటించింది.

శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఈ సినిమాతో కియారా తిరిగి టాలీవుడ్ లో రాణిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

ఇక ఇప్పుడు ఈ అమ్మడికి తెలుగు ఆఫర్స్ వస్తాయా.? వచ్చినా చేస్తుందా.? అన్న అనుమానాలు మొదలయ్యాయి. కొంతమంది కియారా బాలీవుడ్ లో సినిమాలు చేయడమే బెటర్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో.





























