- Telugu News Photo Gallery Cinema photos IPL 2025: Tollywood Actress Kushitha Kallapu Shares Photos With Hardik Pandya
Tollywood: SRHను సపోర్ట్ చేసేందుకు వెళ్లి హార్దిక్‌తో ఫొటో దిగిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో
ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 24) రాత్రి ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తల పడ్డాయి. ఇక హైదరాబాద్ మ్యాచ్ ఉందంటే సినిమా సెలబ్రిటీలు కూడా రెగ్యులర్ కు ఉప్పల్ స్టేడియానికి వస్తుంటారు.
Updated on: Apr 24, 2025 | 2:18 PM

ఉప్పల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉందంటే క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా స్టేడియాలకు పోటెత్తుతారు.

ఈ సీజన్ లోనూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సన్ రైజర్స్ మ్యాచ్ లకు హాజరవుతున్నారు. ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తున్నారు.

పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ కూడా ఎస్ ఆర్ హెచ్ కు వీరాభిమాని. తరచూ ఆ జట్టుకు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది.

బుధవారం ముంబై – హైదరాబాద్ మ్యాచ్ కోసం ఉప్పల్ వెళ్లింది. SRHకి సపోర్టుగా హడావిడి చేసింది. చివరకు హైదరాబాద్ ఓడిపోవడంతో నిరాశకు లోనైంది.

కానీ అంతలోనే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. అనంతరం పాండ్యా స్మైల్ బాగుందని ఆ ఫొటోలను షేర్ చేసింది.

మరీ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు బజ్జీల పాప కుషిత కల్లపు. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది.




