- Telugu News Photo Gallery Cinema photos How has Tollywood journey been in the past four months of 2025?
Tollywood Updates: 2025లో నాలుగు నెలల టాలీవుడ్ జర్నీ కంప్లీట్.. ఇది ఎలా సాగింది.?
ఏప్రిల్ కూడా అయిపొయింది. జనవరి తరువాత స్టార్ హీరోల సందడి లేకుండానే సిల్వర్ స్క్రీన్ జర్నీ కంటిన్యూ అవుతోంది. పేరుకు ప్రతీ నెల 25 సినిమాల వరకు రిలీజ్ అవుతున్నా.. అందులో ఒకటి రెండూ హిట్ కావటం కూడా గగనంగా మారింది. గడిచిన నాలుగు నెలల్లో టాలీవుడ్ జర్నీ ఎలా సాగింది..? ఫుల్ రిపోర్ట్ ఈ స్టోరీలో చూద్దాం.
Updated on: May 03, 2025 | 10:38 AM

భారీ ఆశలతో 2025ని స్టార్ట్ చేసిన టాలీవుడ్ మొదట్లో కాస్త హోప్స్ ఇచ్చినా... తరువాత పూర్తిగా తడబడింది. ఈ నాలుగు నెలల కాలంలో దాదాపు 70 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఐదంటే ఐదే హిట్ అనిపించుకున్నాయి. మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోరాడినా ఫైనల్‌గా సక్సెస్ రేంజ్‌ను రీచ్ అవ్వలేకపోయాయి.

సంక్రాంతి బరిలో రెండు బ్లాక్ బస్టర్స్ రావటంతో ఇండస్ట్రీలో జోష్ కనిపించింది. కానీ ఆ తరువాత అదే జోరు కంటిన్యూ కాలేదు. ఫిబ్రవరిలో వచ్చిన తండేల్‌కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ ఆ నెలలో ఆ ఒక్క సినిమానే హిట్ అనిపించుకుంది.

మార్చిలో పెద్ద హీరోల సందడి లేకపోయినా... మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ లాంటి సినిమాలు బాక్సాఫీస్‌ను ఆదుకున్నాయి. అదే నెలలో కాస్త మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాబిన్‌హుడ్, దిల్‌రుబా సినిమాలు మినిమమ్ వసూళ్లు కూడా సాధించలేకపోయాయి.

సమ్మర్ హాలీడేస్ కావటంతో ఏప్రిల్ మీద చాలా ఆశలు పెట్టుకుంది టాలీవుడ్ బాక్సాఫీస్. కానీ ఈ నెలలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా రాలేదు. ఏప్రిల్ నెలలో వచ్చిన సినిమాలు అన్ని కూడా బోల్తాకొట్టాయనే చెప్పాలి.

ఫస్ట్ వీక్‌లో జాక్, సెకండ్ వీక్ ఓదెలా 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చినా.. అవి హిట్ సౌండ్ చేయలేకపోయాయి. దీంతో ఫస్ట్ ఫోర్ మంథ్స్‌లో నిరాశపరిచిన టాలీవుడ్ స్క్రీన్, కమింగ్ మంథ్స్‌లో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.




