- Telugu News Photo Gallery Cinema photos Heroine Kriti Sanon is busy in Bollywood with Her Movies, Details Here Telugu Actress Photos
Kriti Sanon: గ్లామర్ ఇమేజ్ ఉన్నా.. ఎక్కువగా పెర్ఫామెన్స్‌కు స్కోప్ అంటూన్న కృతి.!
సౌత్ సినిమాతో ఫిలిం జర్నీ స్టార్ట్ చేసినా నార్త్‌లో స్టార్ ఇమేజ్ అందుకున్న బ్యూటీ కృతి సనన్. గ్లామర్ ఇమేజ్ ఉన్నా.. ఎక్కువగా పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్సే చేస్తూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు ఈ బ్యూటీ. అంతేకాదు తన లైఫ్ మార్చేసిన మూమెంట్‌ను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా.. ఇప్పుడు బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్స్ లిస్ట్‌లో ప్లేస్ సంపాదించుకున్నారు కృతి సనన్.
Updated on: Nov 07, 2024 | 8:38 PM

సౌత్ సినిమాతో ఫిలిం జర్నీ స్టార్ట్ చేసినా నార్త్‌లో స్టార్ ఇమేజ్ అందుకున్న బ్యూటీ కృతి సనన్. గ్లామర్ ఇమేజ్ ఉన్నా.. ఎక్కువగా పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్సే చేస్తూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు ఈ బ్యూటీ.

అంతేకాదు తన లైఫ్ మార్చేసిన మూమెంట్‌ను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా.. ఇప్పుడు బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్స్ లిస్ట్‌లో ప్లేస్ సంపాదించుకున్నారు కృతి సనన్.

అయితే ఈ క్రెడిట్ అంతా ఆ ఒక్క సినిమాదే అంటున్నారు ఈ బ్యూటీ. గ్లామర్ హీరోయిన్‌గా కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో రిస్క్ చేసి మరీ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కృతి సనన్.

కెరీర్ ఎర్లీ డేస్‌లోనే ప్రెగ్నెంట్ విమెన్‌గా, ఓ చిన్న బాబు తల్లిగా కనిపించేందుకు ఓకే చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు కృతి. అయితే ఆ రిస్కే ఇప్పుడు కృతిని స్టార్ లీగ్‌లో నిలబెట్టింది.

మిమి సినిమాలో చాలెంజింగ్ రోల్‌లో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ, రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నారు. అయితే అప్పట్లో తాను తీసుకున్న ఆ డెసిషనే ఇప్పటికీ తన కెరీర్‌ను నిలబెడుతుందన్నారు కృతి సనన్.

మిమి సినిమా నటిగా తనకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిందని, ఆ తరువాత కూడా ఎక్స్‌పరిమెంట్ చేసే ఛాన్స్ ఉన్న రోల్సే ఎక్కువగా తన దగ్గరకు వస్తున్నాయన్నారు. కథ నచ్చి, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే డీ గ్లామ్ లుక్‌లో కనిపించేందుకు కూడా రెడీ అంటున్నారు ఈ బ్యూటీ.




