- Telugu News Photo Gallery Cinema photos Do You Remember Nara Rohith Baanam Movie Heroine Vedhika, Her Latest Photos Goes Viral
Vedhika : అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు యమ హాట్‌గా.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా.. ?
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే సినీప్రియులను ఆకట్టుకుని తమకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ వయ్యారి.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది.
Updated on: Nov 07, 2024 | 8:56 PM

వేదిక... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. నారా రోహిత్ హీరోగా బాణం సినిమాతో తెలుగు తెరకు మొదటిసారిగా పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అంతకు ముందు మద్రాసి సినిమాతో 2006లోనే తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాతే తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించింది.

ఆ తర్వాత ముని, రూలర్ చిత్రాల్లో నటించింది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత బంగార్రాజు చిత్రంలో నటించింది.

కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న వేదిక.. ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే మంచులక్ష్మి నటించిన యక్షిణి చిత్రంలో నటించింది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది.

నెట్టింట కొత్త కొత్త ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది వేదిక. తాజాగా చీరకట్టులో వయ్యారాలతో నెట్టింట మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 4 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.




