- Telugu News Photo Gallery Cinema photos Bellamkonda Sai Sreenivas is again focusing on Tollywood after chatrapathi remake Telugu Heroes Photos
Bellamkonda Sai Sreenivas: మళ్లీ టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన బెల్లంకొండ.! ఇప్పుడు బాబు బాగా బిజీ..
సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు లైన్‌లో పెట్టేస్తున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్ అవ్వటంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్.. మళ్లీ బిజీ అవుతున్నారు. అల్లుడు శీను సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు.
Updated on: Nov 07, 2024 | 9:09 PM

సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు లైన్‌లో పెట్టేస్తున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్ అవ్వటంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్.. మళ్లీ బిజీ అవుతున్నారు. అల్లుడు శీను సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు కెరీర్‌లో బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ హిట్ ఒక్కటి కూడా పడకపోవటంతో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయారు. రీసెంట్‌గా ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదు.

భారీ ఆశలు పెట్టుకున్న రీమేక్ డిజాస్టర్ అయ్యింది. దీంతో షార్ట్ బ్రేక్ తీసుకున్న బెల్లంకొండ హీరో మళ్లీ టాలీవుడ్ మీద ఫోకస్ చేశారు. వరుస సినిమాలను లైన్ పెట్టి బిగ్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.

ప్రజెంట్ నాలుడు డిఫరెంట్ జానర్స్‌లో నాలుగు సినిమాలు చేస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న టైసన్ నాయుడు వర్క్ ఆల్రెడీ పూర్తయ్యింది.

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న భైరవం వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. మరో రెండు సినిమాల వర్క్‌లో బిజీగా ఉన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. చావు కబురు చల్లగా ఫేం కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వంలో ఓ మిస్టరీ హరర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు.

బైరెడ్డి లుధీర్ దర్శకత్వంలో ఓ అడ్వంచరస్ ఫాంటసీ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు.




