Amala Paul: శుభలేఖ రాసుకుంటున్న అమలాపాల్..! చక్కర్లు కొడుతున్న అమలా పెళ్లి వార్తలు.
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో... అంటూ నాయక్ సినిమాలో రామ్‌చరణ్‌తో ఆడిపాడిన అమలాపాల్ గుర్తున్నారా? తెలుగులో అంతకు ముందు.. ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేశారు అమలాపాల్. త్వరలోనే పెళ్లికూతురుగా పెళ్లి పీటల మీదకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆమె చిరకాల స్నేహితుడు జగత్ దేశాయ్‌కి యస్ చెప్పారు అమలాపాల్. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా ద్వారా జనాలతో పంచుకున్నారు. స్టైలిష్ వేలో ఈ వేడుక జరిగింది.