- Telugu News Photo Gallery Cinema photos Heroes interested in making more violence based movies due their success
కత్తి పడితే కోట్లే.. ఎరుపెక్కుతున్న థియేటర్లు
హింస... ప్రతి శుక్రవారం హింస... కొన్నిసార్లు మితిమీరిన హింస.. ఆ హింసకే కాసులు కురుస్తున్నప్పుడు, డైరక్టర్లు కూడా అంతకు మించిన హింసను చూపించడానికే మొగ్గు చూపుతున్నారు. మా సినిమాలో హింస ఉంటుంది. థియేటర్లకు వచ్చేవారు కాస్త చూసుకుని మరీ రండి.. అంటూ ముందే హింట్ ఇచ్చేస్తున్నారు. రీసెంట్‌గా నాని హిట్ 3 విషయంలో అలాగే జరిగింది.
Updated on: Jun 06, 2025 | 7:45 PM

అవును.. మా సినిమాలో చంపడాలు నరకడాలు ఎక్కువగానే ఉంటాయన్నారు హిట్ 3 కెప్టెన్. ఆ మూవీలోనే కాదు, నెక్స్ట్ ప్యారడైజ్‌లోనూ అదే పరిస్థితి. రా ట్రూత్.. రా లాంగ్వేజ్ అంటూ ప్యారడైజ్ గ్లింప్స్ కూడా ఎరుపు రంగులోనే కనిపించింది. ఇది కడుపు మండిన కాకుల కథ... అమ్మ రొమ్ములో పాలు లేక, రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ.. అంటూ ప్యారడైజ్ మాస్ యాక్షన్‌గా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్‌కి రెడీ అవుతోంది.

నెక్స్ట్ మెగాస్టార్ ప్రాజెక్టును కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. మొదటి నుంచీ టాలీవుడ్‌లో యాక్షన్ మూవీస్‌కి కేరాఫ్ బోయపాటి శ్రీను. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తో ఆయన చేస్తున్న అఖండ 2లో వయొలెన్స్ లెక్కకు మించే ఉంటుంది..

నీ నెత్తురు కోసం ఎగబడే కత్తులతో ఒకడు కాసుకుని ఉండాడప్పా.. అంటూ సంబరాల ఏటిగట్టు కార్నేజ్‌లో వినిపించే డైలాగు... సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది. అందులో గుట్టలు గుట్టలుగా కనిపించే శవాలే సినిమా ఎంత మాస్‌గా ఉండబోతోందో వివరించేసింది.

అలసట లేని భీకర యుద్ధం.. అలలుగా పారే ఏరుల రక్తం.. వలసపోయినా.. అలసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం.. నేలపైన దండయాత్రలు.. మట్టికింద మృత దేహాలు... ఈ అలజడి ఎవరి కోసం అంటూ కింగ్‌డమ్ గ్లింప్స్ ఆ సినిమా టేస్ట్ చూపించేసింది.

పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా పేరుండదు. కానీ పోయేటప్పుడు ఆ పేరు మాత్రమే ఉంటాది ఆ పేరెట్టా నిలబడాలంటే..... అంటూ లెనిన్ లో అక్కినేని అఖిల్ మాస్ వతార్‌లో కనిపించారు. సీనియర్ హీరోలు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ కత్తి పట్టి బాక్సాఫీస్ దగ్గర ఊచకోతకు రెడీ అయిపోతున్నారు. ఆల్రెడీ రూల్ చేసిన సినిమాలే కాదు, క్యూలో ఉన్న సినిమాల్లోనూ హింస మరో రేంజ్‌లో కనిపించబోతోంది. సిల్వర్ స్క్రీన్ తరచుగా ఎరుపెక్కడానికి సిద్ధమవుతోంది.




