- Telugu News Photo Gallery Cinema photos Hero Vijay Deverakonda new movie VD12 shooting update details Telugu Heroes Photos
Vijay Deverakonda: సమ్మర్ రిబ్బన్‌కట్టింగ్‌కి నేను రెడీ అంటున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
ప్యాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకోవాలంటే.. ఫెలో ప్యాన్ ఇండియా స్టార్‌లు ఏం చేస్తున్నారో గమనించాలి.. అవసరమైతే వాళ్లని ఢీకొట్టాలి. కొన్నిసార్లు డైరక్ట్ అటాక్ కాకపోయినా, ముందూ వెనకాలగా వాళ్లతో పాటు మన అప్పియరెన్స్ కూడా ఉండాలి. అప్పుడే పోటీలో ఉన్నామనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు రౌడీ హీరో కూడా బరిలో ఉన్నానంటూ అలాంటి సిగ్నల్సే పంపిస్తున్నారా.?
Updated on: Aug 08, 2024 | 9:07 PM

వైజాగ్‌లో హిట్ 3 షూటింగ్‌లో పాల్గొంటున్నారు నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ కేరళలో జరుగుతోంది.

ఇప్పుడు రౌడీ హీరో కూడా బరిలో ఉన్నానంటూ అలాంటి సిగ్నల్సే పంపిస్తున్నారా? శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తెరకెక్కిస్తున్ వీడీ12 మూవీ సంగతులేంటి?

సినిమా ఇండస్ట్రీ ది బెస్ట్ సీజన్‌గా ఫీలవుతుంది సమ్మర్‌ని. అలాంటి సమ్మర్ స్టార్టింగ్‌లోనే రిబ్బన్‌కట్టింగ్‌కి నేను రెడీగా ఉన్నానంటూ సిగ్నల్స్ పంపేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ ఏడాది ఫ్యామిలీస్టార్‌తో మెప్పించిన వీడీ నెక్స్ట్ సమ్మర్ మీద కూడా కాసింత ఎర్లీగానే ఖర్చీఫ్ వేసేశారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాకు వీడీ 12అనేది వర్కింగ్ టైటిల్. ఈ నెల్లోనే ఒరిజినల్ టైటిల్‌ని కూడా అనౌన్స్ చేస్తామన్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ.

ఆరేడేళ్లుగా గౌతమ్ తిన్ననూరితో దగ్గరగా ట్రావెల్ అవుతున్న కాన్ఫిడెన్స్ తో... ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండను రెడ్ హాట్ ఫార్మ్ లో చూడటానికి 2025 మార్చి 28న రెడీగా ఉండండి..

ఎ న్యూ కింగ్ షల్ రెయిజ్ అంటూ సినిమా మీద హైప్ పెంచేశారు మేకర్స్. ముందు మీరు రండి.. ఆ వెంటనే మేం సందడి చేస్తాం అంటున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.

అసలు ఎవరూ 2025 మీద కాన్‌సెన్‌ట్రేట్ చేయని టైమ్‌లోనే ఏప్రిల్ 10 నాది అని చెప్పిన హీరో యష్. ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఒక్కొక్కరుగా సమ్మర్‌ని కబ్జా చేయడం మొదలుపెట్టడంతో ప్యాన్ ఇండియా రేంజ్ ఉన్న హీరోల్లో సిసలైన రేస్ మొదలైందని సంబరపడుతున్నారు మూవీ లవర్స్.




