- Telugu News Photo Gallery Cinema photos Hero Dhanush surprises his assistant as he attends his wedding, Photos goes viral
Dhanush: అసిస్టెంట్ పెళ్లి వేడుకలో తళుక్కుమన్న స్టార్ హీరో ధనుష్.. ఫొటోస్ చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. తన అసిస్టెంట్ ఆనంద్ పెళ్లికి హాజరైన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జంటకు అభినందనలు తెలిపారు. ధనుష్‌తో పాటు అసురన్ ఫేమ్ కేన్ కరుణాస్, రాధిక, శరత్‌కుమార్‌లు కూడా ఈ పెళ్లి వేడుకలో తళుక్కుమన్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాతో షేర్ చేయగా అవి కాస్తా తెగ వైరలవుతున్నాయి.
Updated on: Sep 18, 2023 | 9:21 PM

ధనుష్ ఫొటోలను చూసిన అభిమానులు, నెటిజన్లు కొత్త జంటలకు అభినందనలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో ధనుష్ సింప్లిసిటీని ప్రశంసిస్తున్నారు. మా ధనుష్ రియల్ హీరో అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

కాగా ఇటీవల రష్మిక మందన్నా తన అసిస్టెంట్ వివాహానికి హాజరైన సంగతి తెలిసిందే. అంతకు ముందు దళపతి విజయ్, అజిత్ కూడా తమ అభిమానుల పెళ్లిళ్లకు హాజరై సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తు్తం కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటిస్తున్నాడు ధనుష్. అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో వెరైటీ లుక్‌లో కనిపించనున్నాడు ధనుష్.

దీంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడీ కోలీవుడ్ స్టార్ హీరో. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే మన్మథుడు అక్కినేని నాగార్జున ఈ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు.