- Telugu News Photo Gallery Cinema photos Harihara Veeramallu makers are ready to release second single
Harihara Veeramallu: వీరమల్లు ఫ్యాన్స్‌కి పోల్.. హుషారుగా సెకండ్ సింగిల్‌కి సిద్ధం..
ఆల్రెడీ నార్త్ లో ఒకరు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు సౌత్ వంతు. అందులోనూ ఈ సారి బరిలోకి దిగుతున్నది పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. నార్త్ లో వినిపించిన సౌండ్.. పవర్‌స్టార్ మూవీతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో రీసౌండ్ చేయాలి. మాట వినాలి అంటూ ఈ మధ్య పవన్ కల్యాణ్ గొంతులో పాట విన్నప్పటి నుంచీ.. ఇక ఆగలేం బాసూ అని రిక్వెస్టులు మీద రిక్వెస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.
Updated on: Feb 22, 2025 | 8:15 PM

ఆల్రెడీ నార్త్ లో ఒకరు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు సౌత్ వంతు. అందులోనూ ఈ సారి బరిలోకి దిగుతున్నది పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. నార్త్ లో వినిపించిన సౌండ్.. పవర్‌స్టార్ మూవీతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో రీసౌండ్ చేయాలి.

మాట వినాలి అంటూ ఈ మధ్య పవన్ కల్యాణ్ గొంతులో పాట విన్నప్పటి నుంచీ.. ఇక ఆగలేం బాసూ అని రిక్వెస్టులు మీద రిక్వెస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. హరిహరవీరమల్లుని చెప్పిన డేట్‌కి రిలీజ్ చేయమన్నది వారి డిమాండ్.

అందరి మాటలూ విన్న పవర్‌స్టార్ త్వరలోనే ఆ నాలుగైదు రోజులేవో ఇచ్చేస్తానూ... షూటింగ్ పూర్తి చేసుకోండి అని అంటున్నారట మేకర్స్ తో. పవన్ కల్యాణ్ మాట ఇచ్చేశారన్న ఖుషీతో సెకండ్ సింగిల్‌ని హుషారుగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

సాంగ్ ప్రోమో ఎప్పుడు కావాలో మీరే చెప్పండి అంటూ ఫ్యాన్స్ కి పోల్ పెట్టేశారు నిర్మాతలు. మొఘలులను శంభాజీ మహరాజ్ ఎలా వ్యతిరేకించారో చావాలో చూపించి సూపర్ సక్సెస్ అయ్యారు విక్కీ కౌశల్. అది చారిత్రాత్మక టాపిక్.

ఇప్పుడు ఫిక్షనల్ స్టోరీతో హరిహరవీరమల్లుని పవర్‌స్టార్ ఎలాంటి హిట్ చేస్తారో చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు జనాలు. మీరెంతైనా ఊహించుకోండి.. అంతకు మించే ఉంటుంది మూవీ అంటూ రీసెంట్‌గా సినిమా మీద హైప్ పెంచే స్టేట్‌మెంట్ ఇచ్చేశారు నిధి అగర్వాల్.




