- Telugu News Photo Gallery Cinema photos Actress Tanya Ravichandran Latest Black Dress Stunning Photos Goes Viral
Tollywood : పిచ్చెక్కిస్తోంది రోయ్.. ! కిల్లింగ్ లుక్స్‌లో కుర్రాళ్లను ఆగం చేస్తోన్న బ్యూటీని గుర్తుపట్టారా.. ?
ఫిల్మ్ సెలబ్రెటీ బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంతగా సక్సెస్ అందుకోని హీరోయిన్లలో ఆమె ఒకరు. అద్భుతమైన నటనతో నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అంతగా క్రేజ్ రాలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా సినీప్రియులకు మరింత దగ్గరయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?
Updated on: Feb 22, 2025 | 6:31 PM

ప్రస్తుతం మోడ్రన్ గ్లామర్ లుక్స్ తో సోషల్ మీడియాలో అరాచకం సృష్టిస్తోంది ఓ హీరోయిన్. పైన ఫోటోలో చూశారు కదా.. బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ తో మెంటలెక్కిస్తోన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

ఆమె మరెవరో కాదు.. తాన్యా రవిచంద్రన్. ప్రముఖ నటుడు రవిచంద్రన్ మనవరాలు. ఆయన వారసత్వంతోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార చెల్లిగా కనిపించింది.

2017లో పాలే విల్లయతేవా సినిమాతో హీరోయిన్‌గా సినీరంగంలోకి తెరంగేట్రం చేసింది. ఈ సినిమాతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత బృందావనం, కరుప్పన్, నెంచుకు నీతి, మాయోన్, అఖిలన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

విజయ్ సేతుపతి నటించిన కరుప్పన్ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో మరింత పాపులర్ అయ్యింది. అయితే నటిగా విజయాలను అందుకున్నప్పటికీ తాన్యాకు అంతగా అవకాశాలు రాలేదు.

ఇక తెలుగు గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగులో కేవలం సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే పోషించింది. సినిమాల్లో హోమ్లీ లుక్ తో కనిపించే తాన్యా.. తాజాగా నెట్టింట మాత్రం అందాల అరాచకం సృష్టించింది.

ప్రస్తుతం తాన్యా సరైన అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.




