- Telugu News Photo Gallery Cinema photos For the first time kalki pre release event going to held in amaravathi says reports
Kalki: సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతోన్న కల్కి.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా.?
ప్రస్తుతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టి మొత్తం 'కల్కి 2898 ఏడీ' సినిమాపై పడింది. అత్యంత భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అభిమానుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఈ సినిమా ఈ నెల27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే...
Updated on: Jun 17, 2024 | 1:38 PM

కల్కి సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ వంటి అగ్ర తారలు నటిస్తుండడంతో ఈ సినిమాపై ఆశాకన్నంటే అంచనాలు పెరిగిపోయా. ఇప్పటికే అమెరికాలో ప్రీ బుకింగ్స్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించిందీ సినిమా.

కాగా కల్కి సినిమా మరో ట్రెండ్‌కు శ్రీకారం చుట్టుబోతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రీరిలీజ్ ఈవెంట్స్ అంటే ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితమయ్యేవి. ఒకవేళ ఏపీలో అయితే విజయవాడ లేదా వైజాగ్‌లో నిర్వహించే వారు అయితే తొలిసారి కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమరావతిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి ఇప్పటికే చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు రజినీకాంత్‌తో పాటు మరెందరో ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ కల్కి ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ముంబయిలో జూన్ 20వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు కూడా అమితాబ్, దీపికాతో పాటు బాలీవుడ్‌కు చెందిన అగ్ర తారలు నటించనున్నారని సమాచారం. సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాను అదే స్థాయిలో ప్రమోషన్ చేసే స్థాయిలో ఉంది చిత్ర యూనిట్.

ఇక అమరావతిలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో జరగని స్థాయిలో కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కల్కి సినిమా విడుదలకు ముందే రికార్డులను తిరగరాసే పనిలో పడింది. అమెరికాలో అత్యంత తక్కువ సమయంలో మిలియన్నరకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకున్న మూవీగా కల్కి రికార్డ్ నెలకొల్పింది. మరి ఇన్ని అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.




