- Telugu News Photo Gallery Cinema photos Fashion Tips: These white mini dresses are best for summer, take fashion tips from these celebrities
Fashion Tips: ఈ తెల్లటి దుస్తులు వేసవికి ఉత్తమమై ఎంపిక.. సెలబ్రెటీల ఫ్యాషన్ టిప్స్ మీ కోసం
Fashion Tips: వేసవి కాలం వచ్చిందంటే తాలు.. వేసవి తాపాన్ని తగ్గించే చిట్కలపై దృష్టిసారిస్తారు. ఆహారం అలవాట్లు మాత్రమే కాదు.. ధరించే దుస్తుల్లో కూడా తప్పనిసరిగా మార్పు చేసుకోవాల్సిందే. ఎండనుంచి రక్షణ ఇచ్చి హాయిని ఇచ్చేవి కాటన్ దుస్తులు. అవి తెలుపు రంగువి అయితే మరింత ఉత్తమం
Updated on: Mar 11, 2022 | 3:41 PM

సారా అలీ ఖాన్ - ఈ రోజుల్లో లేస్ డ్రెస్‌లు ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ చిత్రంలో, సారా అలీ ఖాన్ వైట్ క్రోచెట్ మినీ డ్రెస్ ధరించి ఉంది. దీని నెక్ లైన్ చతురస్రాకారంలో ఉంది. పఫ్ స్లీవ్‌లతో ఉన్న ఈ డ్రెస్‌లో సారా అలీ ఖాన్ చాలా అందంగా ఉంది.

ప్రియాంక చోప్రా - ఆఫ్-వైట్ మినీ డ్రెస్‌లో దేవ కన్యలా మెరిసిపోతుంది. మోచేతుల వరకూ స్లీవ్స్ ఉన్న ఈ మినీ డ్రెస్ వేసవిలో ఖచ్చితంగా మంచి ఎంపిక. ప్రియాంక బ్లాక్ లెదర్ హీల్స్‌తో మరింత అందంగా కనిపిస్తుంది

అనన్య పాండే - బాలీవుడ్ నటి అనన్య పాండే తెల్లటి శాటిన్ మినీ డ్రెస్ ధరించింది. ఈ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో అనన్య చాలా అందంగా ఉంది. మీరు పార్టీ కోసం అలాంటి దుస్తులను ఎంపిక చేసుకోవచ్చు. అనన్య పాండే తన జుట్టును ప్రీగా వదిలేసింది. తక్కువ మేకప్‌తో సహజంగా కనిపిస్తుంది.

అలియా భట్ - బాలీవుడ్ నటి అలియా భట్ గంగూబాయి కతియావాడి సినిమా వార్తలతో చాలా రోజుల నుంచి హల్ చల్ చేస్తుంది. ఈ చిత్రంలో అలియా తెల్లటి మినీ డ్రెస్‌లో ఉంది. అలియాకు ఈ డ్రెస్ బ్లేజర్ లుక్‌ని ఇస్తుంది. లాంబ్ లెదర్ డ్రెస్‌లో చాలా గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఆఫీసులోని పార్టీ కోసం ఈ రకమైన దుస్తులు మంచి ఎంపిక.

శ్రద్ధా కపూర్ - శ్రద్ధా కపూర్ తెల్లటి దుస్తులు ధరించింది. ఇది బటన్ డౌన్ డ్రెస్.. విక్టోరియన్ స్టైల్ హై నెక్ కాలర్ తొ పాటు బిషప్ స్లీవ్‌లు ఉన్నాయి. లుక్‌ని మరింత గ్రేస్ తెచ్చేలా శ్రద్ధా నలుపు స్ట్రాపీ చెప్పులు ధరించింది. ఈ లుక్‌లో శ్రద్ధా చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది.




