- Telugu News Photo Gallery Cinema photos Dragon movie Actress Kayadu Lohar Will Act In Actor Nani The Paradise Movie
Actor Nani: చేసిన ఒక్క సినిమాతో క్యూ కట్టిన ఆఫర్స్.. కట్ చేస్తే.. నాని ప్యారడైజ్లో ఛాన్స్..
సినీరంగుల ప్రపంచంలో కొన్నిసార్లు ఒక్కసినిమాతోనే హీరోయిన్లు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మలు ఒక్క సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అలా ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది కాయదు లోహర్. ఇటీవల విడుదలైన డ్రాగన్ సినిమాతో స్టార్ అయిపోయిందని చెప్పొచ్చు.
Updated on: May 16, 2025 | 3:51 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాయదు లోహర్. కొన్ని రోజుల క్రితం విడుదలైన డ్రాగన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందని చెప్పొచ్చు.

డ్రాగన్ సినిమా తర్వాత ఈ అమ్మడు వరుస ఆఫర్స్ అందుకుంది. ఇప్పటికే తెలుగులో ఓ ఆఫర్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీ సినమాలో ఛాన్స్ అందుకుంది.

ఫంకీ సినిమానే కాకుండా ఇప్పుడు తమిళ్ హీరో శింబు సరసన నటించే అవకాశం అందుకుంది కాయదు లోహర్. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు, తమిళంలో ఈ అమ్మడు జోరు మీదు దూసుకుపోతుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు చూపిస్తున్న ఈ వయ్యారి.. తాజాగా తెలుగులో మరో క్రేజీ సినిమాలో చేరినట్లుగా తెలుస్తోంది. నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో ఎంపికైనట్లు టాక్.

ఇప్పటికే ఈ విషయంపై సంప్రదింపులు జరిగాయని.. ఆమె నుంచి సానుకూల స్పందన వచ్చిందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది.




