- Telugu News Photo Gallery Cinema photos Do you Remember Banam Movie Heroine Vedhika Latest Stunning Photos Goes Viral
Tollywood: ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్ లెహంగాలో మెరిసిన హీరోయిన్.. ఎన్నాళ్లకు దర్శనం..
ఒకే ఒకే సినిమాతో తెలుగులో ఫేమస్ అయ్యింది. కానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అంతగా గుర్తులేని హీరోయిన్. నార్త్ నుంచి సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీకి అవకాశాలు రావట్లేదు. ఇంతకీ ఎవరో తెలుసా ?.. తనే హీరోయిన్ వేదిక. 2007లో కళ్యాణ్ రామ్ నటించిన విజయదశమి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమాతో ఆమెకు ఎలాంటి గుర్తింపు రాలేదు.
Updated on: Apr 19, 2024 | 6:10 PM

ఒకే ఒకే సినిమాతో తెలుగులో ఫేమస్ అయ్యింది. కానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అంతగా గుర్తులేని హీరోయిన్. నార్త్ నుంచి సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీకి అవకాశాలు రావట్లేదు. ఇంతకీ ఎవరో తెలుసా ?.. తనే హీరోయిన్ వేదిక.

2007లో కళ్యాణ్ రామ్ నటించిన విజయదశమి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమాతో ఆమెకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు నారా రోహిత్ నటించిన బాణం సినిమాతో మరోసారి వెండితెరపై అలరించింది.

తెలుగులో అంతగా క్లిక్ కానీ వేదిక.. కాంచన హరర్ సిరీస్ ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంది. కానీ స్టార్ ట్యాగ్ మాత్రం తెచ్చుకోలేదు. ఇటీవల రజాకర్ సినిమాలో నటించింది. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.

సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ సందడి చేస్తుంది వేదిక. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. అలాగే కొద్ది రోజులుగా వేదిక నెట్టింట షేర్ చేస్తున్న ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా బ్లూ కలర్ లెహంగాలోనే మరింత అందంగా మెరిసిపోయింది. ఫుల్ గ్లామర్ అండ్ మోడ్రన్ లుక్ లో కనిపించిన వేదికను చూసి నెటిజన్స్ ఉడికిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం వేదిక ఫోటోస్ వైరలవుతున్నాయి.




