- Telugu News Photo Gallery Cinema photos Do You Know This Heroine who Did One Film in Telugu, Now Has Chances With Star Heroes, She Is Janhvi Kapoor
Tollywood : ఒక్క సినిమాతోనే టాలీవుడ్ షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు స్టార్ హీరోలతో ఛాన్స్.. ఎవరంటే..
తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. కట్ చేస్తే.. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం హిందీ, తెలుగు భాషలలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. కానీ కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో విమర్శలు అందుకుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.
Updated on: Jun 18, 2025 | 6:35 PM

హిందీలో అనేక భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన చిత్రాలన్నీ భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ తెలుగులో చేసిన ఒక్క సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ అమ్మడు పేరు దక్షిణాదిలో మారుమోగింది. అంతేకాకుండా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ జాన్వీ కపూర్. 27 ఏళ్ల వయసులో కోట్లాది ఆస్తులు సంపాదించింది. ధడక్ సినిమాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరాఠీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సైరత్ సినిమాకు రీమేక్ ఇది.

ఆ తర్వాత హిందీలో విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. హిందీలో వరుసపెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ వయ్యారి.. ఇటీవలే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఇందులో తంగం పాత్రలో సహజ నటనతో కట్టిపడేసింది జాన్వీ. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతోపాటు మరోసారి ఎన్టీఆర్ సరసన దేవర 2లో కనిపించనుంది జాన్వీ.

ఇవే కాకుండా అటు హిందీలోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది జాన్వీ. ప్రస్తుతం ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుుకుంటున్నాయి. ఇటీవల జాన్వీ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంపిక చేసుకుంటుందని టాక్.




