- Telugu News Photo Gallery Cinema photos Do you know of any crazy movie that Nani and Anushka's combo missed?
నాని, అనుష్క కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఏదో తెలుసా?
నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ హీరో వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. నిర్మాతగా, హీరోగా వరసగా సక్సెస్‌లు అందుకుటున్నాడు. రీసెంట్‌గా హిట్ 3తో అభిమానుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే నానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?
Updated on: May 13, 2025 | 5:00 PM

నేచురల్ స్టార్ నాని చాలా మంది నటీనటులతోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఒకప్పుడు టాలీవుడ్‌లోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా సత్తాచాటి, బాహుబలి సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న నటి అనుష్క, నాని కాంబోలో ఓ సినిమా మిస్సైందంట. ఇంతకీ అది ఏ మూవీ అంటే?

నాని, అనుష్క కాంబినేషన్‌లో ఒక సినిమా రావాల్సి ఉండేదంట. చాలా మంది వీరికాంబలో సినిమా వస్తే చూడాలి అనుకున్నారు. కానీ అది క్షణంలో మిస్సైంది. నేచురల్ స్టార్ నానికి అనుష్క అంటే మంచి గౌరవం ఉంటుంది. అంతే కాకుండా ఆమె నటన అంటే నానికి చాలా ఇష్టం.

అంత అభిమానం ఉన్న హీరోయిన్ సినిమాలో అవకాశం వస్తే నాని రిజక్ట్ చేశాడంట. దానికి కూడా కారణం లేకపోలేదు. ఇంతకీ వీరి కాంబలో రావాల్సిన మూవీ ఏది అనేగా మీ ఆలోచన? ఆ సినిమానే మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి.

కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో అనుష్క, నవీన్ పొలిశెట్టి నటిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు అభిమానులను బానే ఆకట్టుకుంది. అయితే ముందుగా ఈ సినిమాలో పొలిశెట్టి స్థానంలో నాని అనుకున్నారంట.కానీ నాని ఆ సినిమాను రిజక్ట్ చేశాడంట.

డేట్స్ ఖాళీ లేకపోవడం, అలాగే నానికి ఆ క్యారెక్టర్ సెట్ కాదు అని ఆ సినిమాను రిజక్ట్ చేశాడంట. అలా నాని, అనుష్క కాంబోలో రావాల్సిన మూవీ మిస్సైంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.



