- Telugu News Photo Gallery Cinema photos Do you know Anushka Shetty is the first actress to join rs 1000 crore collection movie club telugu cinema news
Tollywood: ఫస్ట్ టైమ్ రూ.1000 కోట్ల కలెక్షన్స్ అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం.. ఎవరంటే..
ఒక సినిమాకు రూ. కోటి కాదు.. ఏకంగా ఇప్పుడు రూ.1000 కోట్లు కలెక్షన్స్ వస్తున్నాయి. బాహుబలి తర్వాత దాదాపు చాలా సినిమాలు ఈ రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి. గతేడాది షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. కానీ మీకు తెలుసా ఫస్ట్ టైమ్ రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఏదో.. అందులో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా ?.. తను మరెవరో కాదు..
Updated on: Feb 19, 2024 | 9:19 PM

ఒక సినిమాకు రూ. కోటి కాదు.. ఏకంగా ఇప్పుడు రూ.1000 కోట్లు కలెక్షన్స్ వస్తున్నాయి. బాహుబలి తర్వాత దాదాపు చాలా సినిమాలు ఈ రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి. గతేడాది షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.

కానీ మీకు తెలుసా ఫస్ట్ టైమ్ రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఏదో.. అందులో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా ?.. తను మరెవరో కాదు.. అనుష్క శెట్టి. ఇంతకీ ఏ సినిమాకు అని ఆలోచిస్తున్నారా ?. అదే 2017లో విడుదలై సంచలనం సృష్టించిన బాహుబలి 2 మూవీ.

డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన బాహుబలి మొదటి భాగంలో తమన్నా కథానాయికగా నటించింది. అందులో అనుష్క సైతం కనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన రెండవ భాగంలో అనుష్క పాత్రకు ఎక్కువ నిడివి ఉంది. ఈ మూవీలో ఆమె పాత్ర మరింత హైలెట్ అయ్యింది.

అప్పట్లో ఈ మూవీ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. అలా వెయ్యి కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరిన తొలి కథానాయికగా అనుష్క గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత అనుష్క రెండు మూడు సినిమాల్లో నటించింది. కానీ ఇవి బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉంది అనుష్క. కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న స్వీటీ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనుందట.




